యూపీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అర్థరాత్రి గుడిసెలో ఆదమరచి నిద్రిస్తున్నవారిపైకి అకస్మాత్తుగా ఇసుక లోడుతో కూడిన ట్రక్కు దూసుకువచ్చింది. ఈ ఘటనలో ఎనిమిదిమంది అక్కడికక్కడే మృతి చెందారు.
మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈ ఘటన హర్దోయ్ జిల్లాలో చోటుచేసుకుంది. రోడ్డు పక్కన గుడిసెలో నివసిస్తున్న ఓ కుటుంబంపైకి ఇసుక లోడుతో కూడిన ట్రక్కు దూసుకువచ్చింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఎనిమిది మంది మృతి చెందారు. గంగానది ఒడ్డు నుంచి ఇసుకను తీసుకువస్తున్న ట్రక్కు హర్దోయ్ వైపు వెళుతుండగా ఈ ఘటన జరిగింది.
భల్లా కంజాద్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి మల్వాన్ పట్టణంలో రోడ్డు పక్కగా ఒక గుడిసెలో నివసిస్తున్నాడు. మెహందీఘాట్, కన్నౌజ్ నుంచి హర్దోయ్‌కు వెళ్తున్న ఇసుకతో కూడిన ట్రక్కు ఈ గుడిసెలోకి దూసుకెళ్లింది. దీంతో కుటుంబ సభ్యులంతా ఇసుకలో కూరుకుపోయారు. ఈ ఘటనను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment