లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న మినీ వ్యాన్‌ను ట్రక్కు ఢీకొట్టడంతో ఓ చిన్నారి సహా ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. మరో 12 మందికిపైగా గాయాలయ్యాయి. మోరాదాబాద్ జిల్లాలోని ఖైర్‌ఖాతా గ్రామ సమీపంలోని దల్పత్‌పూర్-కాశీపూర్ రహదారిపై ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. ఓ వివాహ వేడుకకు హజరయ్యేందుకు కుటుంబ సభ్యులు, బంధువులంతా వ్యాన్‌లో వెళ్తున్నారు. ఇంతలో అతివేగంతో వెళ్తున్న ట్రక్కు పికప్ వ్యాన్‌ను ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది.
ప్రమాద తీవ్రత అధికంగా ఉండటంతో వ్యాన్‌పై లారీ బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. వ్యాన్‌లో ప్రయాణిస్తున్న చాలా మంది ప్రయాణికులు శిథిలాల కింద చిక్కుకుపోవడంతో అధికారులు.. చాలా కష్టం మీద వారిని బయటకు తీశారు. ఈ ఘటనలో 15 మంది గాయపడగా వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో రెండు వాహనాల్లో ప్రయాణికులు ఉన్నారు.
చదవండి: పుల్వామాలో ఉగ్రకుట్ర భగ్నం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Comments
Please login to add a commentAdd a comment