గుంటూరు : గుంటూరు జిల్లా పొన్నూరులో ఆదివారం పురపాలక సంఘంకి చెందిన ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.
అలాగే మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.