కోలీవుడ్ స్టార్ హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్ సేవలో దూసుకుపోతున్నాడు. పేదరికంలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. మాత్రం అనే అనే ఫౌండేష్ ద్వారా సేవలు కొనసాగిస్తున్నారు. ఇటీవలే దివ్యాంగులకు టూవీలర్ వాహనాలు అందించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇచ్చిన మాట ప్రకారం మరో పది కుటుంబాలకు ట్రాక్టర్లు అందిస్తున్నారు. ప్రస్తుతం విల్లుపురం జిల్లాలోని ఓ పేద కుటుంబానికి ట్రాక్టర్‌ను తానే స్వయంగా అందించారు.
దీనికి సంబంధించిన వీడియోను రాఘవ లారెన్స్ ట్విటర్‌లో పంచుకున్నారు. విల్లుపురం జిల్లాలో ప్రభు కుటుంబానికి మూడో ట్రాక్టర్ తాళాలు అందజేశానని తెలిపారు. మీ ప్రేమను చూస్తుంటే.. ఇది నాకు మరింత శక్తిని ఇస్తోందని.. ముందుకు సాగడానికి ప్రేరణనిస్తోందని రాసుకొచ్చారు. మనమంతా కలిసి అందరికీ ఉజ్వల భవిష్యత్తును సృష్టించగలం అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
#serviceisgod DAY TWO JOURNEY!
I handed over the 3rd tractor key to the Prabu family in the Villupuram district. Seeing all your love, It's giving us more energy and motivation to go forward. Together, we can make a difference and create a brighter future for all. #Maatram… pic.twitter.com/Hq9lY9vylA— Raghava Lawrence (@offl_Lawrence) May 7, 2024
Comments
Please login to add a commentAdd a comment