రియల్ హీరోకు కేరాఫ్ అడ్రస్ మీరే.. బర్త్‌ డే రోజు ఏం చేశారంటే? | Kollywood Star Hero Raghava Lawrence Gifts To Women's On His Birthday | Sakshi
Sakshi News home page

Raghava lawrence: రాఘవ లారెన్స్ బర్త్‌ డే.. వారి కళ్లలో ఆనందం నింపాడు!

Published Tue, Oct 29 2024 3:52 PM | Last Updated on Tue, Oct 29 2024 4:13 PM

Kollywood Star Hero Raghava Lawrence Gifts To Women's On His Birthday

కోలీవుడ్ స్టార్ రాఘవ లారెన్స్ ప్రస్తుతం ఓ యాక్షన్ అడ్వెంచరస్‌ మూవీలో నటిస్తున్నారు.  రమేశ్‌ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎ స్టూడియోస్‌ ఎల్‌ఎల్‌పీ, నీలాద్రి  ప్రొడక్షన్స్, హవీష్‌ ప్రొడక్షన్స్‌పై కోనేరు సత్యానారాయణ నిర్మించనున్నారు. ఇందులో రాఘవ సరసన బుట్టబొమ్మ  పూజా హెగ్డే నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.  గతేడాది జిగర్తాండ డబుల్‌ ఎక్స్‌ సినిమాతో అలరించిన సంగతి తెలిసిందే. 

అయితే రాఘవ లారెన్స్ సినిమాల్లో మాత్రమే హీరో కాదు.. రియల్‌ లైఫ్‌లోనే హీరోనే. ఇప్పటికే ఆయన తన మాత్రం ఫౌండేషన్‌ ద్వారా పేదలు, రైతులకు సాయం అందిస్తున్నారు. ఇప్పటికే పలువురు వికలాంగులు, రైతులు అవసరమైన ట్రాక్టర్లు, త్రీవీలర్స్ అందజేశారు. ఇవాళ తన బర్త్‌ డే కావడంతో పేద వితంతు మహిళలకు అండగా నిలిచారు. వారికి కుట్టు మిషన్స్ అందించి వారి కళ్లలో ఆనందం నింపారు. ఈ విధంగా సాయం అందించి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు రాఘవ లారెన్స్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement