ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే ట్రాక్టర్ ఇది. భారీ వాహనాల తయారీ సంస్థ జేసీబీ దీనిని రూపొందించింది. ఎంతటి అధునాతనమైన ట్రాక్టర్లయినా వాటి గరిష్ఠ వేగం దాదాపు 40 కిలోమీటర్ల వరకు ఉంటుంది. జేసీబీ తాజాగా రూపొందించిన ఐదు టన్నుల ఈ భారీ ట్రాక్టర్ గరిష్ఠవేగం గంటకు 247 కిలోమీటర్లు. ఆరు సిలిండర్ల డీజిల్‌మ్యాక్స్ ఇంజన్‌తో తయారు చేసిన ఈ వాహనం అత్యంత వేగంగా పరుగులు తీసే ట్రాక్టర్‌గా గిన్నిస్ రికార్డు సాధించడం విశేషం.
జేసీబీ ఇదివరకు రూపొందించిన ఫాస్ట్‌ట్రాక్ ట్రాక్టర్ గరిష్ఠంగా 217.6 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. ఈ ట్రాక్టర్ పనితీరును బ్రిటన్‌లోని ఎల్వింగ్టన్ ఎయిర్‌ఫీల్డ్‌లో పరీక్షించారు. దీని సాంకేతికతలో మార్పులు చేసి కొత్తగా రూపొందించిన ట్రాక్టర్ ఏకంగా 247 కిలోమీటర్ల వేగం అందుకోవడం ఆనందంగా ఉందని జేసీబీ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ టిమ్ బమ్‌హోప్ తెలిపారు. శరవేగంగా పరుగులు తీసే ఇలా ట్రాక్టర్లు సువిశాలమైన వ్యవసాయ క్షేత్రాల్లో పనులను వేగంగా చేయడానికి ఉపకరిస్తాయని, సాంకేతికంగా మరిన్ని మెరుగులు చేసిన తర్వాత దీనిని మార్కెట్‌లోకి అందుబాటులోకి తేనున్నామని బమ్‌హోమ్ తెలిపారు.
చదవండి: పాల ప్యాకెట్ తెచ్చిన అదృష్టం..వందల కోట్లు సంపాదిస్తున్న పేటీఎం సీఈవో!
Comments
Please login to add a commentAdd a comment