హైదరాబాద్: భారత్ నెంబర్ 1 ట్రాక్టర్ ఎక్స్‌పోర్ట్ బ్రాండ్ సోనాలికా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్)లో రికార్డు స్థాయిలో 40,700 ట్రాక్టర్ల అమ్మకాలు జరిపింది. సోనాలికా వ్యాపార చరిత్రలో ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఇంత భారీ స్థాయిలో విక్రయాలు జరపడం ఇదే తొలిసారి.
మార్కెట్ షేర్‌లో కూడా సంస్థ ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఇదే తరహా రికార్డు విక్రయాలు మున్ముందు త్రైమాసికాల్లో కూడా కొనసాగుతాయన్న విశ్వాసాన్ని ఈ మేరకు వెలువడిన ఒక ప్రకటన తెలిపింది.
వ్యవసాయం–పర్యావరణ వ్యవస్థల మధ్య సమతౌల్యత సాధిస్తూ ప్రపంచ స్థాయి ప్రమాణాలు, నాణ్యతతో కూడిన హెవీ డ్యూటీ ట్రాక్టర్లు అలాగే ఇతర సరసమైన వ్యవసాయ ఉత్పాదకతలను అందించడానికి కట్టుబడి ఉన్నట్లు ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ (సోనాలికా అండ్ సోలిస్)జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రామన్ మిట్టల్ పేర్కొన్నారు. రైతులను మరింత ఉత్పాదకత దిశగా నడిపించడానికి, ప్రగతిశీల బాటలో వారిని సంపన్నులుగా మార్చడానికి సంస్థ తన వంతు కృషి చేస్తుందని కూడా ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment