అమెరికన్ టెక్నాలజీ సంస్థ ‘ఫాక్స్‌కాన్’ త్వరలోనే పూర్తిస్థాయి సెల్ఫ్‌డ్రైవింగ్ ట్రాక్టర్‌ను అందుబాటులోకి తేనుంది. విద్యుత్తుతో పనిచేసే సెల్ఫ్‌డ్రైవింగ్ ట్రాక్టర్‌ను ‘మోనార్క్ ట్రాక్టర్’ పేరుతో రూపొందిస్తోంది. అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఈ ట్రాక్టర్ పూర్తిగా విద్యుత్ వాహనం. దీని బ్యాటరీ పూర్తిగా చార్జ్ కావడానికి పది గంటలు పడుతుంది.
దీని మోటార్ 70 హార్స్‌పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఎంతటి పొలాన్నయినా ఇది సునాయాసంగా దున్నేస్తుంది. అంతేకాదు, దీనికి హార్వెస్టర్స్, సెపరేటర్స్ వంటి గాడ్జెట్స్‌ను కూడా అమర్చుకోవచ్చు. వాటితో పంట కోతలు, కలుపు ఏరివేత పనులు కూడా ఈ ట్రాక్టర్ తేలికగా చేయగలదు. ‘ఫాక్స్‌కాన్’ దీని ధరను ఇంకా ప్రకటించలేదు గాని, భారీగానే ఉండవచ్చని మార్కెట్ వర్గాల అంచనా.
Comments
Please login to add a commentAdd a comment