monarch
-
నేను ‘మోనార్క్’ని... సెల్ఫ్‌డ్రైవింగ్ ట్రాక్టర్
అమెరికన్ టెక్నాలజీ సంస్థ ‘ఫాక్స్‌కాన్’ త్వరలోనే పూర్తిస్థాయి సెల్ఫ్‌డ్రైవింగ్ ట్రాక్టర్‌ను అందుబాటులోకి తేనుంది. విద్యుత్తుతో పనిచేసే సెల్ఫ్‌డ్రైవింగ్ ట్రాక్టర్‌ను ‘మోనార్క్ ట్రాక్టర్’ పేరుతో రూపొందిస్తోంది. అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఈ ట్రాక్టర్ పూర్తిగా విద్యుత్ వాహనం. దీని బ్యాటరీ పూర్తిగా చార్జ్ కావడానికి పది గంటలు పడుతుంది. దీని మోటార్ 70 హార్స్పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఎంతటి పొలాన్నయినా ఇది సునాయాసంగా దున్నేస్తుంది. అంతేకాదు, దీనికి హార్వెస్టర్స్, సెపరేటర్స్ వంటి గాడ్జెట్స్‌ను కూడా అమర్చుకోవచ్చు. వాటితో పంట కోతలు, కలుపు ఏరివేత పనులు కూడా ఈ ట్రాక్టర్ తేలికగా చేయగలదు. ‘ఫాక్స్‌కాన్’ దీని ధరను ఇంకా ప్రకటించలేదు గాని, భారీగానే ఉండవచ్చని మార్కెట్ వర్గాల అంచనా. -
కొత్త చరిత్ర సృష్టించిన బ్రిటన్ రాణి ఎలిజబెత్–2
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్–2 (96) ఆదివారం కొత్త చరిత్ర సృష్టించారు. అత్యధిక కాలం పాలించిన వారి జాబితాలో థాయ్‌లాండ్ మాజీ పాలకుడు భూమిబల్ అతుల్యతేజ్‌ను వెనక్కు నెట్టి రెండో స్థానంలో నిలిచారు. భూమిబల్ 1927 నుంచి 2016 మధ్య 70 ఏళ్ల 126 రోజులు రాజుగా ఉన్నారు. ఆమె ఇంకో రెండేళ్లు పదవిలో కొనసాగితే ఫ్రాన్స్ లూయి–14ని కూడా దాటేసి తొలి స్థానంలో నిలుస్తారు. లూయి–14 1643 నుంచి 1715 దాకా 72 ఏళ్ల 110 రోజులు ఫ్రాన్స్‌ను పాలించారు. ఎలిజెబెత్–2 1953లో సింహాసనమెక్కారు. బ్రిటన్ను అత్యధిక కాలం పాలించిన క్వీన్ విక్టోరియా రికార్డును 2015 సెప్టెంబర్‌లో అధిగమించారు. ఆమె పాలనకు 70 ఏళ్లు నిండిన సందర్భంగా వారం రోజులుగా ఇంగ్లండ్‌లో ఘనంగా వేడుకలు జరుగుతున్న విషయం తెలిసిందే. అనారోగ్యంతో వాటిలో పాల్గొనలేకపోయిన రాణి ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు వారిని ఉద్దేశించి ఆదివారం ఆమె లేఖ విడుదల చేశారు. ‘‘ఒక రాణి 70 ఏళ్లు పాలిస్తే సంబరాలు చేసుకోవాలంటూ నిజానికి రూలేమీ లేదు. అయినా మీరే చొరవ తీసుకొని ఇంత భారీగా వేడుకలు జరపడం నన్ను ఆనం దోద్వేగాలకు లోనుచేసింది’’ అని పేర్కొన్నారు. చదవండి: ఉక్రెయిన్‌లో హోరాహోరీగా యుద్ధం.. మరో నాలుగు నెలలు: -
స్పీకర్ అంటే మోనార్క్ కాదు: కోడెల
హైదరాబాద్: సభా వ్యవహారాలపై కొత్త ఎమ్మెల్యేలకు శిక్షణ ఇస్తామని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా ఎన్నికైన కోడెల శివప్రసాదరావు తెలిపారు. స్పీకర్ అంటే మోనార్క్ కాదన్నారు. ప్రజా సమస్యలను చర్చించే విషయంలో సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటానని చెప్పారు. సభ్యులు హుందాగా వ్యవహరించాలని, ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. సభలో అర్థవంతమైన చర్చలు జరగాలని ఆకాంక్షించారు. వీలైనంత త్వరగా నూతన ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. మౌలిక వసతుల గురించి ఆలోచించాల్సిన పనిలేదని అభిప్రాయపడ్డారు. గతంలో టెంట్ల కింద సమావేశాలను నిర్వహించిన సందర్భాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా కోడెల శివప్రసాదరావు నేడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.