విషాదం: ఆడుకుంటూ పిల్లలు ట్రాక్టర్‌ స్టార్ట్‌ చేయడంతో.. | Child Fell Under Tractor And Passed Away In Narayanpeta District | Sakshi
Sakshi News home page

విషాదం: ప్రాణం తీసిన పిల్లల ఆట.. ఆడుకుంటూ ట్రాక్టర్‌ స్టార్ట్‌ చేయడంతో..

Published Wed, Feb 23 2022 2:43 AM | Last Updated on Wed, Feb 23 2022 11:17 AM

Child Fell Under Tractor And Passed Away In Narayanpeta District - Sakshi

ఊట్కూర్‌: ఇంటి ముందు నిలిపిన ట్రాక్టర్‌ను పిల్లలు ఆడుకుంటూ స్టార్ట్‌ చేయడంతో ముందుకు కదిలి ఒక బాలికను బలిగొంది.. మరో ఇద్దరు తీవ్రంగా గాయ పడ్డారు. ఈ సంఘటన నారాయణపేట జిల్లాలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఊట్కూర్‌ మండలం ఎర్గాట్‌పల్లిలో మంగళవారం మైసమ్మ జాతర నిర్వహించారు. గ్రామానికి చెందిన పెద్ద నర్సింహులు కుటుంబ సభ్యులతో ట్రాక్టర్‌పై జాతరకు వెళ్లి వచ్చి.. ఇంటి ముందు వాహనాన్ని ఆపాడు. రాత్రి 8 గంటల సమయంలో కొందరు చిన్నారులు ట్రాక్టర్‌పైకి ఎక్కి ఆడుకుంటున్నారు.

వీరిలో ఒకరు ఇంట్లోకి వెళ్లి ట్రాక్టర్‌ తాళం తెచ్చి స్టార్ట్‌ చేయడంతో ముందుకు కదిలింది. అదే సమయంలో ట్రాక్టర్‌ ముం దు ఆడుకుంటున్న రూప (8), కల్పన, వెంకటేష్‌లను ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఊట్కూర్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రూప మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. కల్పన, వెంకటేశ్‌ చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో ప్రథమ చికిత్స చేసి నారాయణ పేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. విషాదం: ఆడుకూంటూ పిల్లలు ట్రాక్టర్‌ స్టార్ట్‌ చేయడంతో  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement