
ట్రాక్టర్ బోల్తా పడడంతో మృతి చెందిన సుధాకర్
గుండాల: వరి పొలంలో ట్రాక్టర్‌తో దమ్ము చేస్తుండగా.. ట్రాక్టర్ పల్టీ కొట్టడంతో కింద నలిగిపోయిన రైతు అక్కడికక్కడే మృతిచెందాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం తూరుబాక గ్రామంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన జోగ వెంకయ్య కుమారుడు సుధాకర్(23) తన పొలంలో ట్రాక్టర్‌కు కల్టివేటర్ అమర్చి దమ్ము చేస్తున్నాడు. చివరి మడి చేస్తుండగా బురదలో ట్రాక్టర్ దిగబడింది. దిగబడిన ట్రాక్టర్‌ను బయటకు తీసే యత్నంలో ఒక్కసారిగా పల్టీకొట్టింది. దీంతో డ్రైవింగ్ సీటులో ఉన్న సుధాకర్ ట్రాక్టర్ కింద బురదలో ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందాడు. జేసీబీ సాయంతో ట్రాక్టర్ తొలగించి మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ నాగరాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment