పేరుకేమో సంక్షేమ పథకం. తీరుకు మాత్రం దోపిడీకి వేసిన పథకం. టీడీపీ పాలనలో పాటించిన సూత్రమిది. నీరు–చెట్టు నుంచి మొదలుపెడితే రైతు రథం వరకు అన్ని పథకాలు ఈ సూత్రం ప్రకారం పనిచేసినవే. ఆ అవినీతి ఆనవాలు ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్నాయి. టీడీపీ నేతలు తమ బినామీలను లబి్ధదారులుగా చేర్చి ప్రజాధనాన్ని ఎలా కొల్లగొట్టారో బయటపడుతోంది.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : రైతు రథాలను టీడీపీ నాయకులు అవినీతి పథాల్లో నడిపిన తీరు విస్మయపరుస్తోంది. తమ బినామీలను లబ్ధిదారులగా చేర్చి ఏకంగా రూ.33 లక్షల సబ్సిడీ మొత్తాన్ని కొట్టేసిన బాగోతం వెలుగు చూసింది. రైతు రథం కింద నాడు మంజూరు చేసిన ట్రాక్టర్లు ప్రస్తుతం లబ్ధిదారుల వద్ద లేవంటే అతిశయోక్తి కాదు. అవెప్పుడో అక్రమార్కుల ఇళ్ల వద్దకు చేరిపోయాయి. జిల్లాకు 24 యూనిట్లు మంజూరైతే ఇప్పుడు లబి్ధదారుల వద్ద ఉన్న ట్రాక్టర్లు రెండే రెండు. మిగతావన్నీ హాంఫట్ అయ్యాయి. 2019 ఎన్నికలకు ముందు జరిగిన ఈ స్కామ్ టీడీపీ నాయకుల అసలు స్వరూపాన్ని వివరిస్తుంది.
‘పథకం’ ప్రకారమే...
2018 డిసెంబర్, 2019 ఫిబ్రవరి, మార్చి నెలలో రై తు రథం పథకాన్ని గత టీడీపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఒక్కో యూనిట్ ఖరీదు ఒక్కో రకంగా ని ర్ణయించి, యూనిట్‌కు రూ.లక్షా 50వేల సబ్సిడీని ప్ర కటించింది. అప్పట్లో రైతు రథం పథకంపై పెద్ద ఎ త్తున ప్రచారం చేసింది. అంతా చేసి ఆ ట్రాక్టర్లు ఇ చ్చింది మాత్రం వారి బినామీలకే. దీనిపై అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. అవి నిజమేనని నేడు తేలు తోంది. ట్రాక్టర్లు మంజూరయ్యాక వాటిని నాటి పా లకుల అనుచరులు లాగేసుకున్నారు. ఇందులో ఎంత మొత్తంలో చేతులు మారాయో తెలీదు గానీ రైతు రథం పథకం ఆశయం మరుగున పడిపోయి అనర్హుల చేతికి ట్రాక్టర్లన్నీ వెళ్లిపోయాయి.
అక్రమాలు ఇలా..
►జిల్లాలో రైతు రథం పథకం కింద 24 యూని ట్లు(ట్రాక్టర్లు) మంజూరు చేశారు.
►అత్యధికంగా రూ. 6,28,021 నుంచి అత్యల్పంగా రూ.5,64,720 ధర నిర్ణయించారు.
►ఇందులో ప్రతి దానికి లక్షా 50వేల రూపాయలు చొప్పున సబ్సిడీని అందజేశారు. అయితే మంజూరులో అవకతవకలు జరిగాయని పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ప్రస్తుత వ్యవసాయ అధికారులు రైతు రథం కింద మంజూరు చేసిన ట్రాక్టర్లపై విచారణ చేశారు.
ఈ విచారణలో విస్తుగొల్పే విషయాలు వెలుగు చూశాయి.
►మంజూరైన 24 ట్రాక్టర్లలో ప్రస్తుతం రెండు మాత్రమే అసలైన లబ్దిదారుల వద్ద ఉన్నాయి.
►ఓ రెండు యూనిట్లు ఏకంగా గ్రౌండ్ కాలేదు. మ రో రెండు ట్రాక్టర్లకు సంబంధించి మంజూరైన చాసిస్ నంబర్లు ఒకటుంటే, ప్రస్తుతం లబ్ధిదారుల వద్ద ఉన్న ట్రాక్టర్ల చాసిస్ నంబర్ మరోలా ఉంది.
►అంటే అప్పట్లో పాత ట్రాక్టర్లను చూపించి సబ్సిడీ మొత్తాన్ని కొట్టేశారన్న అనుమానాలు ఉన్నాయి.
►ఇక 18 ట్రాక్టర్లు లబి్ధదారుల వద్ద ప్రస్తుతం లేవు. అవన్నీ చేతులు మారిపోయాయి.
►అవన్నీ అప్పట్లో వెనకుండి కథ నడిపించిన పెద్దల చేతిలోకి వెళ్లిపోయాయని తేలింది.
►అధికారులైతే ప్రస్తుతానికి వాటిని లబ్దిదారులు అమ్మేశారని భావిస్తున్నారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక కూడా వ్యవసాయ అధికారులు పంపించారు.
►మొత్తానికి అక్షరాలా రూ. 33లక్షల సబ్సిడీ మొత్తాన్ని గత ప్రభుత్వంలో కొట్టేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపితే ఆ ట్రాక్టర్లు ఎవరి చేతికి వెళ్లా యి? అప్పట్లో నడిచిన బినామీ బాగోతం తదితర అవినీతి గుట్టు అంతా బయటపడనుంది.
రైతు రథం.. టీడీపీ నాయకుల అవినీతి పథం
Published Wed, Sep 1 2021 8:24 AM | Last Updated on Wed, Sep 1 2021 8:33 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment