Taiwan Foxconn Company To Build Driverless Electric Tractor - Sakshi
Sakshi News home page

వారెవ్వా, సూపర్‌ ట్రాక్టర్‌.. డ్రైవర్‌ లేకపోయినా దూసుకుపోతుంది!

Published Sun, Sep 11 2022 7:01 AM | Last Updated on Sun, Sep 11 2022 12:58 PM

Taiwan Foxconn Company To Build Driverless Electric Tractor - Sakshi

డ్రైవర్‌ లేకపోయినా ఫర్వాలేదు. ఎలాంటి పొలాన్నయినా ఇట్టే దున్నిపారేస్తుంది ఈ ట్రాక్టర్‌. డ్రైవర్‌లేని ట్యాక్సీలు ఇప్పుడిప్పుడే కొన్ని దేశాల్లో వాడుకలోకి వస్తున్న సంగతి తెలిసిందే. తైవాన్‌కు చెందిన బహుళజాతి సంస్థ ‘ఫాక్స్‌కాన్‌’ తొలిసారిగా డ్రైవర్‌లెస్‌ ట్రాక్టర్‌ను రూపొందించింది. ‘మోనార్క్‌ ట్రాక్టర్‌’ సంస్థతో కలసి ‘ఫాక్స్‌కాన్‌’ పూర్తిగా విద్యుత్తుతో నడిచే ఈ డ్రైవర్‌లెస్‌ ట్యాక్సీని అధునాతనమైన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పనిచేసేలా తయారు చేసింది.

దీనిని ఒకసారి చార్జ్‌ చేసుకుంటే, ఏకధాటిగా పదిగంటలు పనిచేస్తుంది. ఈ ట్రాక్టర్‌కు అమర్చిన ఎలక్ట్రిక్‌ మోటార్‌ 70 హార్స్‌పవర్‌ సామర్థ్యంతో ఎలాంటి పొలంలోనైనా ఇట్టే పనిచేయగలుగుతుంది. దీని పనితీరుపై ‘ఫాక్స్‌కాన్‌’ పరీక్షలు జరుపుతోంది. త్వరలోనే దీనిని మరింత మెరుగ్గా తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

చదవండి: వినడానికి కొత్తగా ఉన్నా.. ఈ టైర్ల కంపెనీ సేల్స్‌ టెక్నిక్‌ మైండ్‌బ్లోయింగ్‌!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement