driverless tractor
-
వారెవ్వా, సూపర్ ట్రాక్టర్.. డ్రైవర్ లేకపోయినా దూసుకుపోతుంది!
డ్రైవర్ లేకపోయినా ఫర్వాలేదు. ఎలాంటి పొలాన్నయినా ఇట్టే దున్నిపారేస్తుంది ఈ ట్రాక్టర్. డ్రైవర్‌లేని ట్యాక్సీలు ఇప్పుడిప్పుడే కొన్ని దేశాల్లో వాడుకలోకి వస్తున్న సంగతి తెలిసిందే. తైవాన్‌కు చెందిన బహుళజాతి సంస్థ ‘ఫాక్స్‌కాన్’ తొలిసారిగా డ్రైవర్‌లెస్ ట్రాక్టర్‌ను రూపొందించింది. ‘మోనార్క్ ట్రాక్టర్’ సంస్థతో కలసి ‘ఫాక్స్‌కాన్’ పూర్తిగా విద్యుత్తుతో నడిచే ఈ డ్రైవర్‌లెస్ ట్యాక్సీని అధునాతనమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసేలా తయారు చేసింది. దీనిని ఒకసారి చార్జ్ చేసుకుంటే, ఏకధాటిగా పదిగంటలు పనిచేస్తుంది. ఈ ట్రాక్టర్‌కు అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 70 హార్స్పవర్ సామర్థ్యంతో ఎలాంటి పొలంలోనైనా ఇట్టే పనిచేయగలుగుతుంది. దీని పనితీరుపై ‘ఫాక్స్‌కాన్’ పరీక్షలు జరుపుతోంది. త్వరలోనే దీనిని మరింత మెరుగ్గా తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. చదవండి: వినడానికి కొత్తగా ఉన్నా.. ఈ టైర్ల కంపెనీ సేల్స్ టెక్నిక్ మైండ్‌బ్లోయింగ్! -
సొంతంగా దున్నేస్తుంది
రైతన్న కాయకష్టాన్ని తగ్గించేందుకు శాస్త్ర విజ్ఞానం తొలినుంచి కృషి చేస్తూనే ఉంది. సైన్సు కృషి వల్లనే నాగలి నుంచి ట్రాక్టర్ల వరకు అనేక ఆవిష్కరణలు రైతుకు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే రైతుకు మరింత సాయం చేసే నూతన ఆవిష్కరణను జాన్ డీర్ కంపెనీ తీసుకువచ్చింది. డ్రైవర్‌తో అవసరం లేని ట్రాక్టర్‌ను కంపెనీ రూపొందించింది. 8–ఆర్ ట్రాక్టర్‌గా పిలిచే ఈ ఆధునిక వాహనాన్ని అమెరికాలోని లాస్‌వెగాస్‌లో జరుగుతున్న కన్జూమర్ ఎలక్ట్రానిక్ షోలో ప్రదర్శించింది. కేవలం పొలం దున్నడమే కాకుండా ఇందులో పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ తెలిపింది. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే ఎక్కడినుంచైనా దీన్ని ఆపరేట్ చేయవచ్చని, ఇప్పటికే ఉన్న ట్రాక్టర్‌ను ఈ ట్రాక్టర్లాగా అప్‌గ్రేడ్ చేయవచ్చని తెలిపింది. దీని ధరను ఇంకా నిర్ణయించలేదు, ఈ ఏడాది చివరకు మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. తొలుత యూఎస్‌లో 20 కొత్త ట్రాక్టర్లను విడుదల చేయాలని, వీటికి లభించే స్పందన ఆధారంగా ఉత్పత్తి పెంచాలని కంపెనీ భావిస్తోంది. భవిష్యత్‌లో ఒక్క ఆపరేటర్ వేలాది రోబోలతో సాగుపని చేయించే దిశలో.. ఇది ముందడుగని యూకే జాతీయ రైతు సంఘం నేత టామ్ కొనియాడారు. ప్రత్యేకతలు.. ► ఈ వాహనం కృత్రిమ మేథ (ఏఐ) ఆధారంగా పనిచేస్తుంది. దీనిలో 6 స్టీరియో కెమెరాలు, జీపీఎస్ ఉంటాయి. ► కెమెరాల్లో ట్రాక్టర్‌కు ముందు 3, వెనుక 3 ఉంటాయి. ప్రతి 100 మిల్లీ సెకన్లకు ఒకమారు వీటిని ఏఐ పర్యవేక్షిస్తుంటుంది. ► పొలం దున్నే సమయంలో ఏవైనా జంతువులు ట్రాక్టర్‌కు దగ్గరకు వచ్చినా సెన్సర్ల ఆధారంగా గుర్తించి వెంటనే దానంతటదే ఆగిపోతుంది. ► దీంతో పాటు అంగుళం దూరంలో ఏదైనా తగిలే అవకాశం ఉన్నట్లు తెలిస్తే వెంటనే ట్రాక్టర్ నిలిచిపోతుంది. ► ఈ కెమెరాలను, కంప్యూటర్ను మామూలు ట్రాక్టర్‌కు అమర్చడం ద్వారా ఒక్కరోజులో సాధారణ ట్రాక్టర్‌ను 8–ఆర్గా అప్‌గ్రేడ్ చేయవచ్చు. ► రైతు చేతిలోని స్మార్ట్ ఫోన్లో వీడియో ద్వారా ట్రాక్టర్ కదలికలను పర్యవేక్షించవచ్చు. ► దున్నాల్సిన భూమి కోఆర్డినేషన్స్ను (జీపీఎస్ ఆధారంగా అక్షాంశ, రేఖాంశాలను గుర్తించి నిర్ధారించిన కమతం హద్దులను), డైరెక్షన్స్‌ను ముందుగా ఫీడ్ చేయాలి, అనంతరం తదనుగుణంగా ట్రాక్టర్ పని చేస్తుంది. ► దున్నడమే కాకుండా వరుసలో విత్తనాలు చల్లడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ► ధరపై అధికారిక ప్రకటన రాకున్నా, సుమారు 50 వేల డాలర్లు (రూ. 37 లక్షలు) ఉండొచ్చని అంచనా. -
డ్రైవర్‌లెస్ ట్రాక్టర్ వచ్చేసింది
న్యూఢిల్లీ : నిరంతరం వ్యవసాయ క్షేత్రంలో స్వేదం చిందించే కర్షకుల కష్టాన్ని తగ్గించేందుకు.. వ్యవసాయ ఉపకరణాల తయారీ సంస్థ ఎస్కార్ట్ లిమిటెడ్ డ్రైవర్‌లెస్ ట్రాక్టర్లను అందుబాటులోకి తెచ్చింది. వ్యవసాయానికి సాంకేతికతను జోడించే ప్రయత్నంలో భాగంగా ఆటోమేటెడ్ ట్రాక్టర్‌ను గురువారం లాంచ్ చేసింది. డ్రైవర్‌లెస్ ట్రాక్టర్‌ను ఆపరేట్ చేసేందుకు మైక్రోసాఫ్ట్, రిలయన్స్ జియో, ట్రింబుల్, సంవర్ధన మదర్సన్ గ్రూప్ వంటి సాఫ్ట్వేర్ కంపెనీలతో జతకట్టినట్లు పేర్కొంది. ఎస్కార్ట్ గ్రూప్ ఎండీ నిఖిల్ నందా మాట్లాడుతూ.. ఈ స్మార్ట్ ట్రాక్టర్ దుక్కి దున్నడం, విత్తనాలు చల్లడం వంటి పనులు చేస్తుందని తెలిపారు. రానున్న రెండేళ్లలో అధిక సంఖ్యలో ఈ ట్రాక్టర్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కృత్రిమ మేథతో ట్రాక్టర్‌ను నడపడం ద్వారా రైతులకు శ్రమను తగ్గించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అదే విధంగా మృత్తికా ఆరోగ్యం, విత్తనాలు, నీటి యాజమాన్య వ్యవస్థ వంటి అంశాల్లో కూడా పురోగతి సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎస్కార్ట్ యాజమాన్యం తెలిపింది. చిన్న, సన్నకారు రైతులకు చేదోడుగా నిలిచేందుకు వీలుగా ట్రాక్టర్లు, విత్తనాలు నాటే యంత్రాలను అద్దెకిస్తున్నామని పేర్కొంది. -
డ్రైవర్‌లెస్ ట్రాక్టర్ వస్తోంది... ఆవిష్కరించిన మహీంద్రా
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ (ఎం అండ్ ఎం) తాజాగా తొలిసారిగా డ్రైవర్‌లెస్ ట్రాక్టర్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. కంపెనీ దీన్ని వచ్చే ఏడాది దశల వారీగా అందుబాటులోకి తీసుకురానుంది. చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలో ఈ ట్రాక్టర్‌ను అభివృద్ధి చేశారు. ఇక 20 హెచ్‌పీ– 100 హెచ్‌పీ శ్రేణిలోని ట్రాక్టర్లలోనూ డ్రైవర్‌లెస్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. వ్యవసాయ విధానాల్లో తాజా కొత్త ఆవిష్కరణల వల్ల పలు మార్పులు చోటుచేసుకోవచ్చని, ఉత్పాదకతతోపాటు ఆహారోత్పత్తి పెరగొచ్చని ఎం అండ్ ఎం మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా అభిప్రాయపడ్డారు. డ్రైవర్‌లెస్ ట్రాక్టర్లలో ఆటోస్టీర్, ఆటో హెడ్‌ల్యాండ్ టర్న్, రిమోట్ ఇంజిన్ స్టార్–స్టాప్ ఆప్షన్ వంటి పలు ప్రత్యేకతలున్నాయని వివరించారు.