టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని రైతు అవతారంలో తళుక్కుమన్నాడు. ధోని ట్రాక్టర్ ఎక్కి పొలం దున్నిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. క్రికెటర్గా, ఆర్మీ మేజర్గా, ఇటీవలే పోలీస్ ఆఫీసర్గా విభిన్న అవతారాల్లో కనిపించిన ధోనిని ఇలా రైతు లుక్‌లో చూడడం అభిమానులకు పులకింతలు పెట్టింది. స్వయంగా ట్రాక్టర్ నడిపిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ధోని.. ''కొత్తది నేర్చుకోవడం బాగుంది.. అయితే పని పూర్తి చేయడానికి మాత్రం చాలా సమయం పట్టింది'' అంటూ క్యాప్షన్ జత చేశాడు.
ఎంఎస్ ధోనికి గ్రామీణ వాతావరణం, వ్యవసాయం అంటే చాలా ఇష్టం. అందుకే సమయం దొరికినప్పుడల్లా..రైతుగా మారుతాడు. ఇప్పటికే ధోని కడక్ నాథ్ కోళ్లను కూడా పెంచుతున్నాడు. ఇటీవలే ఐపీఎల్ ప్రాక్టీస్‌లో భాగంగా రాంచీ స్టేడియానికి బైక్‌పై వచ్చి అందర్ని ఆశ్చర్యపరిచాడు. తాజాగా రైతు లుక్‌లో అభిమానులను అలరించాడు. ఇక 2020లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఎంఎస్ ధోని.. ఆ తర్వాత ఐపీఎల్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు.
గతేడాది సీఎస్‌కే కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోని తనకు తానుగా తప్పుకున్నాడు. ఆ తర్వాత జడేజాకు నాయకత్వ బాధ్యతలు అప్పగించినప్పటికి ఒత్తిడిని తట్టుకోలేక జడ్డూ సీజన్ మధ్యలోనే వదిలేశాడు. దీంతో ధోనినే మరోసారి దిక్కయ్యాడు. ఇక 2023 ఐపీఎల్ కోసం ధోని సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. ఇప్పటి వరకు చూసుకుంటే ధోని అన్ని ఫార్మాట్లు కలిపి 538 మ్యాచ్‌లు ఆడాడు. 44.96 సగటుతో 21,834 పరుగులు సాధించాడు. ఇందులో 16 సెంచరీలు, 108 అర్థసెంచరీలు చేశాడు.
చదవండి: జబ్బలు చరుచుకున్నారు.. ఇప్పుడేమైంది
'అందరూ మీలా షార్ప్‌గా ఉండరు'.. ఆసీస్ మాజీ క్రికెటర్‌కు చురకలు
Comments
Please login to add a commentAdd a comment