![Mahindra Thar collision leaves tractor in two parts watch video - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/14/Mahindra%20thar.jpg.webp?itok=t91B1Pwl)
మహీంద్రా పాపులర్ వెహికల్ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు మహీంద్రా థార్. ఆఫ్-రోడింగ్ సామర్థ్యం, డిజైన్, రగ్గడ్ లుక్స్‌తో దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన లైఫ్ స్టయిల్ ఎస్‌యూవీగా పేరొందింది.అయితే థార్‌కు సంబంధించిన ఒకవీడియో ఇపుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. (అపుడు పాల ప్యాకెట్ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!)
థార్ ఢీకొనడం వల్ల ట్రాక్టర్‌ను రెండు భాగాలుగా విడిపోవడం హాట్‌టాపిక్‌గా నిలుస్తోంది. వీడియోలో ఇది స్పష్టంగా కనిపించింది. యూట్యూబర్ ప్రతీక్ సింగ్ తన ఛానెల్‌లో షేర్ చేసిన వీడియో ప్రకారంప్రమాదానికి గురైన తర్వాత ట్రాక్టర్ రెండు భాగాలుగా విడిపోవడం, అలాగే రోడ్డు పక్కన దెబ్బతిన్న మహీంద్రా థార్ ఎస్‌యూవీ కనిపిస్తుంది. గుజరాత్‌లోని ఉనా-భావనగర్ నేషనల్ హైవేపై ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.
తాజా నివేదిక ప్రకారం తీవ్రంగా గాయపడిన ట్రాక్టర్ డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే ఇక్కడ తప్పు ఎవరిది అనేది అస్పష్టం. అయితే ట్రాక్టర్ డ్రైవర్ యు-టర్న్ తప్పించుకోవడానికి రాంగ్ సైడ్ నుండి రావడం వల్ల ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక అంచనా. ఈ వార్తపై పూర్తి స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.! (MRF బెలూన్లు అమ్మి, కటిక నేలపై నిద్రించి: వేల కోట్ల ఎంఆర్‌ఎఫ్ సక్సెస్ జర్నీ)
Comments
Please login to add a commentAdd a comment