నందిగామలో ట్రాక్టర్‌ బోల్తా.. ముగ్గురు మృతి | Road Accident At Nandigama Jonnalagadda | Sakshi
Sakshi News home page

నందిగామలో ట్రాక్టర్‌ బోల్తా.. ముగ్గురు మృతి

Published Fri, Jan 17 2020 10:29 AM | Last Updated on Fri, Jan 17 2020 1:38 PM

Road Accident At Nandigama Jonnalagadda - Sakshi

సాక్షి, కృష్ణా : జిల్లాలోని నందిగామ మండలం జొన్నలగడ్డలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జొన్నలగడ్డ వద్ద 25 మంది కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిని నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కూలీలు ఖమ్మం జిల్లా మధిరకు పనికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కూలీలు ప్రయాణిస్తున్న టాక్టర్‌.. ఆటోను తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అతివేగం వల్లే ట్రాక్టర్‌ అదుపు తప్పి బోల్తా పడిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న నందిగామ ఎమ్మెల్యే.. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement