
సాక్షి, యాలాల: గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న శ్మశానవాటిక పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ పౌసమి బసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సంగెంకుర్దు, బెన్నూరు, అగ్గనూరులో పర్యటించి, అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. సంగెంకుర్దులో శ్మశానవాటికను పరిశీలించేందుకు బయలుదేరగా కలెక్టర్ కారు బురద రోడ్డుపై ముందుకు కదలలేదు. దీంతో వాహనం దిగిన ఆమె స్థానికులు తెప్పించిన ట్రాక్టర్‌పై వెళ్లి పనులను పరిశీలించారు. క్రిమిటోరియం నిర్మాణా లకు సంబంధించిన బిల్లులు రావడం లేదని పలువురు సర్పంచ్‌లు కలెక్టర్‌కు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు శ్రీలత, పటేల్‌రెడ్డి, భీమప్ప, పీఆర్ డీఈ కరణాకర్‌చారి, ఎంపీడీఓ పుష్పలీల, డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మణ్ ఉన్నారు.
వర్షం ముసిరేసి.. దంచేసి
వికారాబాద్ అర్బన్: జిల్లాలో జోరు వాన కురిసింది శుక్రవారం ఉదయం 10నుంచి సాయంత్రం 4గంటల వరకు కాస్త శాంతించిన వరుణుడు ఆతర్వాత మళ్లీ దంచేశాడు. దీంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. కాగా గురువారం అత్యధికంగా పూడూరులో 25.2, దౌల్తాబాద్‌లో 25.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెద్దేముల్ 21, వికారాబాద్, కుల్క చర్లలో15, పరిగి14, దోమ, ధారూరు, బంట్వారంలో 12, మోమిన్‌పేట 9, నవాబుపేట్ 8.8, మర్పల్లి 7.8, తాండూరు 8.8, కొడంగల్‌లో 6.2, బషీరాబాద్ 5.8, బొంరాస్‌పేట్ 4.2, యాలాలలో 3.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment