సినీ పరిశ్రమలో ఎంతమంది హీరోలున్నా కరోనా సమయంలో పేదల జీవితాల్లో హీరోగా నిలుస్తున్నది మాత్రం ఒక్కరే. అతనే సోనూసూద్. లాక్‌డౌన్ వల్ల వలస కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున తరుణంలో ఎంతో మందికి ఆయన సాయం చేశారు. తాజాగా చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన ఓ రైతును ఆదుకునేందుకు ముందుకొచ్చారు. తండ్రి వ్యవసాయ పనుల్లో కాడెద్దులుగా మారి సాయం చేస్తున్న ఇద్దరు కూతుళ్ల వీడియో చూసి చలించిపోయిన సోనూ సూద్ వెంటనే స్పందించారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. ఆ కుటుంబానికి రెండు ఎద్దులు ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. (సోనూ సూద్ గొప్ప ప్రయత్నం)
మరికొద్దిసేటికే ఆయన మరోసారి స్పందిస్తూ వారికి కావాల్సింది ఎద్దులు కాదు.. ట్రాక్టర్. అది ఆదివారం సాయంత్రానికి వారి పొలంలో ఉంటుంది. ఇకపై ఆ అమ్మాయిలు ఇద్దరు బాగా చదువుకోవచ్చంటూ ట్వీట్ చేశారు. అయితే ఖరీఫ్ సీజన్‌లో సేద్యం పనులు చేయడానికి ఆ రైతుకు కాడెద్దులు లేకపోవడంతో అతని ఇద్దరు కూతుళ్లే కాడెద్దులుగా మారారు. ఆ అమ్మాయిలు ఇద్దరు కాడి లాగడం, వెనుకనుంచి తల్లిదండ్రులిద్దరూ విత్తనాలు వేయడం సోషల్ మీడియా వైరల్‌గా మారింది. దీంతో ఈ వీడియో చూసిన సోనూసూద్ నేనున్నానంటూ వారికి సాయం చేయడానికి ముందుకొచ్చి మరోసారి తన గొప్పమనసును చాటుకున్నారు.
This family doesn’t deserve a pair of ox 🐂..
— sonu sood (@SonuSood) July 26, 2020
They deserve a Tractor.
So sending you one.
By evening a tractor will be ploughing your fields 🙏
Stay blessed ❣️🇮🇳 @Karan_Gilhotra #sonalikatractors https://t.co/oWAbJIB1jD
Comments
Please login to add a commentAdd a comment