
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మంగళవారం ఉదయం హర్దోయి వద్ద ట్రక్కు ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా ప్రమాద స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment