
ట్రాక్టర్ దొంగల అరెస్టు చూపుతున్న రూరల్ సీఐ శ్రీనివాస్
కర్నూలు, డోన్ రూరల్: మండల పరిధిలోని చిన్నమల్కాపురం గ్రామంలో గత నెల 30న ట్రాక్టర్ చోరీకి పాల్పడిని ఐదుగురు దొంగలను డోన్ రూరల్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. నిందితుల వివరాలను రూరల్ సీఐ శ్రీనివాస్ విలేకరులకు వెళ్లడించారు. చిన్నమల్కాపురం గ్రామానికి చెందిన గోవర్ధనగిరి వెంకటేష్ గత నెల 30న తన ట్రాక్టర్‌ను ఇంటి వద్ద నిలిపి రాత్రి నిద్రించాడు. ఉదయం లేచి చూడగా ట్రాక్టర్ చోరీకి గురైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు డోన్ రూరల్ ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా గ్రామానికే చెందిన కంబగిరి, ప్యాపిలి బీసీ కాలనీకి చెందిన పేట రాజు, పురుషోత్తం, హరిప్రసాద్‌రెడ్డిలను అదుపులోకి తమదైన శైలిలో విచారించగా ట్రాక్టర్‌ను చోరీ చేసి అనంతపురం జిల్లా గార్లదిన్నె గ్రామంలోని సోమలింగారెడ్డి ఇంట్లో ఉంచినట్లు ఒప్పుకున్నారు. దీంతో అక్కడకు వెళ్లి ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకొని, నలుగురితో పాటు సోమలింగారెడ్డిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు హాజరుపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment