సాక్షి, ముంబై: సోనాలిక ట్రాక్టర్స్ కంపెనీ దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను మార్కెట్లోకి తెచ్చింది. టైగర్ పేరుతో అందిస్తున్న ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ధర రూ.5.99 లక్షలు(ఎక్స్ షోరూమ్) అని సోనాలిక ట్రాక్టర్స్ తెలిపింది. ఈ ట్రాక్టర్‌ను 25.5 కేడబ్ల్యూ నేచురల్ కూలింగ్ కాంపాక్ట్ బ్యాటరీతో రూపొందించామని, నిర్వహణ వ్యయాలు చాలా తక్కువగా (డీజిల్ ట్రాక్టర్ల వ్యయాలతో పోల్చితే నాలుగో వంతు)ఉంటాయని సోనాలిక గ్రూప్ ఈడీ రామన్ మిట్టల్ తెలిపారు. (అప్రీలియా ఎస్‌ఎక్స్‌ఆర్ 160 వచ్చేసింది)
నాలుగు గంటల్లోనే ఫుల్ చార్జింగ్...
ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ గరిష్ట వేగం గంటకు 24.93 కి.మీ. అని, ఒక్కసారి బ్యాటరీని చార్జింగ్ చేస్తే ఎనిమిది గంటల పాటు ఈ ట్రాక్టర్ పనిచేస్తుందని(రెండు టన్నుల ట్రాలీతో) మిట్టల్ వివరించారు. నాలుగు గంటల్లోనే పూర్తిగా చార్జింగ్ చేసే ఫాస్ట్ చార్జింగ్ సిస్టమ్‌ను కూడా ఆఫర్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ టైగర్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను యూరప్‌లో డిజైన్ చేశామని, పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో తయారు చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment