
సాక్షి, మహబూబాబాద్: అసలే నిండు గర్భిణి... ఆపై పురిటి నొప్పులు... ట్రాక్టర్‌పై ఆస్పత్రికి ప్రయాణించి నరకయాతన అనుభవించిందామె. మనసును కదిలించే ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం కామారంలో జరిగింది. గ్రామానికి చెందిన నిండు గర్భిణì మద్దెల పుష్పలతకు పురిటి నొప్పులు రావడంతో స్థానిక ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలు ఆమెను చికిత్స నిమిత్తం... ట్రాక్టర్‌లో కోమట్లగూడెం పీహెచ్‌సీకి తరలించారు.
పురిటి నొప్పులకు తోడు ట్రాక్టర్ ఎత్తేయడంతో గర్భిణీ నరకయాతన అనుభవించింది. అభివృద్ధిలో దూసుకుపోతున్నామని ప్రభుత్వాలు చెబుతున్నా... ఇంకా ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితులు మాత్రం దుర్భరంగా ఉన్నాయి. సరైన రోడ్డు మార్గాలు లేవు. దీనికి వర్షాలు కూడా తోడు కావడంతో వాహనాలు అస్సలు వెళ్లలేని పరిస్థితి. దీంతో అత్యవసర సమయాల్లో ట్రాక్టర్ల వంటి వాటిని ఆశ్రయిస్తున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment