కొత్త ట్రెండ్‌!...అందర్నీ ఆశ్చర్యపరిచేలా వధువు ఎంట్రీ! | Bride Riding A Tractor To Enter Wedding Goes Viral | Sakshi
Sakshi News home page

వీడియో: అందర్నీ ఆశ్చర్యపరిచేలా వధువు ఎంట్రీ!.. వరుడు షాక్‌

May 28 2022 9:34 AM | Updated on May 28 2022 11:46 AM

Bride Riding A Tractor To Enter Wedding Goes Viral  - Sakshi

ఇటీవల కాలంలో పెళ్లిళ్లు చాలా చాలా వైరైటీగా జరుగుతున్నాయి. యువత కొత్త ట్రెండ్‌ సృష్టించి మరీ విన్నూతన రీతిలో పెళ్లి చేసుకుంటున్నారు. కొత్తదనం కోసం విచిత్రమైన వేషధారణ లేదా అందరూ ఆశ్చర్యపోయేలా వివాహతంతు చేసుకునేందుకే ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. అందులో భాగంగానే వరుడుని సర్‌ప్రైజ్‌ చేసేలా డ్యాన్స్‌లు వేయడం లేదా ఆటపట్టించడం వంటివి చేస్తున్నారు. అచ్చం అలానే  చేసింది మధ్యప్రదేశ్‌కి చెందిన పెళ్లికూతురు. వాస్తవానికి పెళ్లికూతురు మండపానికి కారులోనో లేదా పల్లకిలోనే వస్తుంది. ఐతే మరింత విన్నూత్నంగా రావలనుకుందో ఏమోగానీ చాలా వెరైటీ ఎంట్రీ ఇచ్చింది ఆమె.


వివరాల్లోకెళ్తే...మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌లో జావా గ్రామంలో పెళ్లి జరిగింది. ఐతే ఈ పెళ్లి ఊరేగింపులో వధువు ఎంట్రీ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ మేరకు వధువు భారతి తాగ్డే నల్ల కళ్లజోడు ధరించి, ట్రాక్టర్‌ పై పెళ్లి మండపానికి విచ్చేసింది. అంతేకాదు ఆమె స్వయంగా నడుపుతూ తన సోదరులతో కలిసి వచ్చింది. ఈ క్రమంలో వధువు మాట్లాడుతూ..పల్లకీలోనో, కారులోనో ఎంట్రీ ఇచ్చే ట్రెండ్ పాతబడిపోయిందని, అందుకు భిన్నంగా ఏదైనా చేయాలని అనుకున్నాని తాగ్డే చెబుతోంది. గతంలో  కూడా ఇలానే ఓ వధవు చేతితో కత్తి పట్టుకుని గుర్రం పై స్వారీ చేసుకుంటూ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో  తెగ వైరల్‌ అవుతోంది.

(చదవండి: ట్రెండింగ్‌లో ‘కుక్క’.. ఆ జంటను ఆడేసుకుంటున్నారు.. ఫన్‌ ఫన్‌ మోర్‌ ఫన్‌..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement