పుష్కరాల్లో మరో అపశ్రుతి | two dies as tractor turns turtle in east godavari district | Sakshi
Sakshi News home page

పుష్కరాల్లో మరో అపశ్రుతి

Published Sat, Jul 18 2015 2:14 PM | Last Updated on Sun, Sep 3 2017 5:45 AM

two dies as tractor turns turtle in east godavari district

తూర్పుగోదావరి: గోదావరి పుష్కరాల్లో మరో అపశ్రుతి చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా గేదెల్లంక పుష్కరఘాట్‌లో శనివారం విషాదం చోటు చేసుకుంది. గేదెల్లంక వద్ద ట్రాక్టర్‌ బోల్తా పడి ఇద్దరు చనిపోయారు. ఐదుగురు గాయపడ్డారు. ట్రాక్టర్ కింద మరింత మంది యాత్రికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

 

మృతులు, గాయపడ్డవారు ఐనవిల్లి మండలం సేనపల్లిలంక గ్రామస్తులుగా గుర్తించారు. ట్రాక్టర్‌ను తొలగించేందుకు అధికారులు క్రేన్‌ను తెప్పిస్తున్నారు.  కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. గాయపడినవారిని చికిత్స నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement