జైపూర్: ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామం వద్ద ఆదివారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు బోల్తా పడడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మంచిర్యాల డిపోకు చెందిన బస్సు గోదావరిఖని నుంచి బెల్లంపల్లి వైపు వెళుతుండగా ముందున్న వాహనాన్ని తప్పించే క్రమంలో రహదారి మార్జిన్ దాటిపోయి బోల్తాపడినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది వరకు ప్రయాణికులు ఉండగా, ఇద్దరికి గాయాలు అయ్యాయి. వారిని మంచిర్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు.