
న్యూఢిల్లీ: పండుగలు అందరూ సరదాగా ఆనందంగా జరుపుకోవడానికే. కానీ వాటిని ఎవరైన సరే ఎవరికీ ఇబ్బందీ కలిగించకుండా చేసుకోవాలి. అంతేగానీ మన సరదాతో ఇతరులకు ప్రాణాపాయ స్థితి కలిగిలే చేయకూడాదు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి చేసి అతనే కటకటాల పాలయ్యే స్థితి కొని తెచ్చుకున్నాడు.
వివరాల్లోకెళ్లే..హోలీ చక్కగా ఒకరి మీద ఒకరు రంగుల జల్లుకోవడం లేదా కలర్స్ వాటర్ లేదా బెలూన్‌లతో జల్లుకుంటారు. మన చుట్టుపక్కల ఉన్నవాళ్ల మీద మన స్నేహితుల మీద జల్లుకోవాలి. అంతేకాదు వాళ్లు ఏదైన సీరియస్ పనిలో ఉన్న ప్రమాదకరమైన వస్తువులతో పని చేస్తున్నప్పుడూ ఇలాంటి పండుగకి సంబంధించిన చిలిపి పనులు అసలు చేయకూడదు.
కానీ యూపీకి చెందిన ఒక వ్యక్తి ప్రయాణికులతో వేగంగా వస్తున్న ఆటో పై వాటర్ బెలూన్ విసిరాడు అంతే ఒక్కసారిగా ఆటో ఒకవైపుకు తిరగబడిపోయింది. ఈ ఘటనలో ఎంతమంది గాయాలపాలయ్యారో పూర్తి సమాచారం తెలియలేదు. కానీ ఈ ఘటనకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఆ ఘటనకు కారణమైన గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే ఈ ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లాలో చోటు చేసుకుందని పేర్కొన్నారు.
पानी का गुब्बारा मारने पर पलटा ऑटो, सोशल मीडिया पर वायरल हुआ वीडियो#ViralVideo #Holi pic.twitter.com/83G9QhwHbk
— Zee News (@ZeeNews) March 20, 2022
(చదవండి: జైలులో స్నేహం.. కథ మొదలైంది అక్కడినుంచే!)