నల్గొండ(భువనగిరి): భువనగిరి మండల కేంద్రం శివారులో యాదగిరిగుట్ట బైపాస్ రోడ్డు వద్ద శనివారం ఉదయం ఆటో బోల్తాపడింది. ఈ సంఘటనలో హైదరాబాద్‌కు చెందిన ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
క్షత గాత్రులను హుటాహుటిన భువనగిరిలోని ఓ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి గుండాల వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.