విశాఖపట్నం జిల్లాలోని అనంతగిరి మండలం కుడియా గ్రామం వద్ద శనివారం మధ్యాహ్నం ఓ జీపు బోల్తాపడడంతో ఇద్దరు మృతి చెందారు.
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలోని అనంతగిరి మండలం కుడియా గ్రామం వద్ద శనివారం మధ్యాహ్నం ఓ జీపు బోల్తాపడడంతో ఇద్దరు మృతి చెందారు. సుమారు 10 మందికిపైగా గాయపడినట్టు తెలుస్తోంది. శివర్ల నుంచి దేవరాపల్లి వైపు జీపు వెళ్తుండగా బ్రేకులు ఫెయిల్ అయి బోల్తా పడినట్టు సమాచారం. పది మంది క్షతగాత్రులను 108 వాహనంలో దేవరాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరికొందరు క్షతగాత్రులను కూడా వేరొక వాహనంలో తరలిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.