పంజాగుట్ట వద్ద పెను ప్రమాదం తప్పింది. ప్రమాదవశాత్తూ టిప్పర్, బైక్లు శనివారం ఉదయం ఢీకొన్నాయి.
హైదరాబాద్: పంజాగుట్ట వద్ద పెను ప్రమాదం తప్పింది. ప్రమాదవశాత్తూ టిప్పర్, బైక్లు శనివారం ఉదయం ఢీకొన్నాయి. అనంతరం అదుపుతప్పిన టిప్పర్ పంజాగుట్ట ఫ్లైఓవర్ నుంచి కింద పడింది. ఆ సమయంలో ఫ్లైఓవర్ కింద ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇటీవలే చిన్నారి రమ్య కుటుంబం కారు ప్రమాదానికి గురైన ప్రాంతంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ ఘటనలో వాహనంలో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.