Panjagutta Flyover
-
పంజాగుట్ట ఫ్లైఓవర్‌పై ప్రమాదం
హైదరాబాద్ : పంజాగుట్ట ఫ్లై ఓవర్ పై సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం పై రాష్ డ్రైవింగ్ చేస్తూ మద్యం మత్తులో ప్లై ఓవర్ పై డివైడర్ని ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో అనిష్ భార్గవ్ (20) అనే యువకుడు మృతి చెందాడు. మరో యువకుడు వంశీ(19) గాయాల పాలయ్యాడు. మద్యం మత్తులో ఉండడం , అతివేగంగా డ్రైవ్ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని స్థానిక సీఐ రవీందర్ యువకులను హెచ్చరించారు. ఇలాంటి చర్యలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవన్నారు. -
చెరువు కాదిది.. పంజాగుట్ట ఫ్లై ఓవర్!
హైదరాబాద్: అవును మీరు విన్నది నిజమే. పంజాగుట్ట ఫ్లై ఓవర్ నీటితో నిండింది. దాని పైనుంచి నీళ్లు ప్రవహిస్తున్నాయి..! గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వందలాది అపార్టుమెంట్ల సెల్లార్లు నీటితో నిండాయి. అయితే లోతట్టు ప్రాంతాల్లోనే కాకుండా భారీ వర్షాలకు విచిత్రంగా ఎగువ ప్రాంతాల్లో కూడా నీటి కష్టాలు తప్పడం లేదు. గురువారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి పంజాగుట్ట ఫ్లై ఓవర్ పై కొద్దిసేపు నీరు భారీగా ప్రవహించింది. దీంతో ఆ రూట్ లో ప్రయాణించినవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో తీసిన ఫొటో చూస్తే.. పంజాగుట్ట ఫ్లై ఓవర్ పై ఏమేర నీరు నిలిచిందో అర్థమవుతుంది. హైదరాబాద్‌లో మరో రెండురోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అప్రమత్తం చేయడంతో శుక్ర, శనివారాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. మున్సిపల్ మంత్రి కేటీఆర్‌తో పాటు నగరానికి చెందిన మంత్రులు, జీహెచ్ఎంసీ యంత్రాంగం, పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండి ప్రజలకు అవసరమైన సహాయ కార్యక్రమాలు చేపట్టింది. లోతట్టు ప్రాంతాలు, కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పోలీస్ శాఖలోని వివిధ విభాగాలతో పాటు రాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఆర్మీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగాలను సహాయ చర్యల్లో ఉపయోగిస్తున్నారు. మరోవైపు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటితో హుస్సేన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం కంటే ఎక్కువ పరిమాణంతో ప్రవహిస్తోంది. సాగర్‌లోకి నిండుగా చేరిన నీరు లుంబినీపార్కులోకి ప్రవేశించడంతో పార్కులోకి సందర్శకుల ప్రవేశాన్ని అధికారులు నిలిపేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎన్టీఆర్ గార్డెన్, సంజీవయ్య పార్కు, లుంబినీ పార్కులకు శుక్ర, శనివారాల్లో సెలవు ప్రకటించారు. -
పంజాగుట్ట ఫ్లై ఓవర్ నుంచి కిందపడ్డ టిప్పర్
-
పంజాగుట్ట ఫ్లై ఓవర్ నుంచి కిందపడ్డ టిప్పర్
హైదరాబాద్: పంజాగుట్ట వద్ద పెను ప్రమాదం తప్పింది. ప్రమాదవశాత్తూ టిప్పర్, బైక్‌లు శనివారం ఉదయం ఢీకొన్నాయి. అనంతరం అదుపుతప్పిన టిప్పర్ పంజాగుట్ట ఫ్లైఓవర్ నుంచి కింద పడింది. ఆ సమయంలో ఫ్లైఓవర్ కింద ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇటీవలే చిన్నారి రమ్య కుటుంబం కారు ప్రమాదానికి గురైన ప్రాంతంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో వాహనంలో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. -
కార్లు కాలిపోయాయ్...
హైదరాబాద్, న్యూస్‌లైన్: హైదరాబాద్‌లో రోడ్డుపై వెళ్తున్న రెండు కార్లు ఒక్కసారిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఓ ఘటన ఔటర్ రింగ్‌రోడ్డుపై చోటుచేసుకోగా, మరొకటి పంజగుట్ట ఫ్లైఓవర్‌పై జరిగింది. అదృష్టవశాత్తు రెండు సంఘటనల్లోనూ ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. బంజారాహిల్స్‌లో నివాసం ఉండే వ్యాపారి లలిత్.. ఆదివారం ఉదయం మద్యం మత్తులో తన వోక్స్వ్యాగన్ వెంటో (ఏపీ9 సీడీ 531)లో బేగంపేట నుంచి బంజారాహిల్స్‌కి వెళుతున్నారు. పంజగుట్ట ఫ్లైఓవర్ పై హిమాలయ బుక్ డిపో మలుపు వద్ద కారు అదుపు తప్పి రెయిలింగ్‌కు రాసుకుంటూ వెళ్లింది. దీంతో కారుకు మంటలు వ్యాపించాయి. వెంటనే తేరుకున్న లలిత్ బయటకు దూకేశారు. చూస్తుండగానే వాహనం మంటల్లో దగ్ధమైపోయింది. అనంతరం ఫైరింజన్ వచ్చి మంటలు ఆర్పగా, పోలీసులు ఆ కారును అక్కడి నుంచి తొలగించి ట్రాఫిక్‌ను నియంత్రించారు. లలిత్‌ను ఆసుపత్రికి తరలించారు. ఔటర్ రింగ్‌రోడ్డుపై: అప్పటి వరకు ఔటర్ రింగ్‌రోడ్డుపై రయ్యిమని దూసుకుపోతున్న కారు.. ఒక్కసారిగా మంటల్లో కాలిపోయింది. సాఫ్ట్వేర్ ఉద్యోగి మ్రినాల్.. తన స్వస్థలం ఢిల్లీ వెళ్లడానికి నల్లగండ్ల నుంచి తన వేగన్-ఆర్ కారు (డీఎల్2సీజెడ్ 5688)లో శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరారు. నార్సింగ్ దాటేసరికి కారులో కాలుతున్న వాసన రావటంతో అనుమానంతో పక్కన నిలిపేశారు. కిందకు దిగి పరిశీలిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆయన కళ్ల ముందే కారు పూర్తిగా కాలిపోయింది. రెండు రోజులక్రితం కారును సర్వీసింగ్‌కు ఇచ్చానని, లోపల నీరుండటంతోనే వైర్లకు మంటలు వచ్చి ఉంటాయని బాధితుడు పేర్కొన్నారు. -
పంజాగుట్ట ఫ్లైఓవర్‌పై తగలబడిన కారు
హైదరాబాద్: పంజాగుట్ట ఫ్లైఓవర్‌పై ఈ తెల్లవారుజామున ఓ కారు తగలబడింది. ఫ్లైఓవర్‌పై రెయింలింగ్‌ను కారు ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. కారులోని వ్యక్తిని పోలీసులు కాపాడడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. మంటల్లో కారు పూర్తిగా దగ్ధమయింది. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. అవుటర్ రింగు రోడ్డుపైనా కూడా ఇటువంటిదే మరో ప్రమాదం జరిగింది. నార్సింగ్ చౌరస్తా వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. మారుతి వేగనార్ కారు గొతిలో పడి పల్టీలు కొట్టడంతో మంటలు వ్యాపించాయి. కారులో ఉన్న ఐదుగురు డోర్లు తెరుచుకుని బయటకు వచ్చేయడంతో ప్రాణాలతో బయటపడ్డారు.