హైదరాబాద్ : పంజాగుట్ట ఫ్లై ఓవర్ పై సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం పై రాష్ డ్రైవింగ్ చేస్తూ మద్యం మత్తులో ప్లై ఓవర్ పై డివైడర్‌ని ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో అనిష్ భార్గవ్ (20) అనే యువకుడు మృతి చెందాడు. మరో యువకుడు వంశీ(19) గాయాల పాలయ్యాడు. మద్యం మత్తులో ఉండడం , అతివేగంగా డ్రైవ్ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని స్థానిక సీఐ రవీందర్ యువకులను హెచ్చరించారు. ఇలాంటి చర్యలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవన్నారు.
Comments
Please login to add a commentAdd a comment