ముమ్మిడివరం (తూర్పు గోదావరి): తాళ్లరేవు మండలంలో శనివారం సాయంత్రం బైపాస్ రోడ్డులో వ్యాన్ ఢీకొని ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. అల్లవరం నుంచి ద్విచక్ర వాహనంపై జేఎన్‌టీయూకు వస్తున్న ముగ్గురు విద్యార్థులను ఎదురుగా వేగంగా వస్తున్న వ్యాన్ ఢీకొంది.
ఈ ఘటనలో జేఎన్‌టీయూలో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఎద్దాడ మహేష్ (18) అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలవడంతో కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వ్యాన్ ఢీకొని ఇంజనీరింగ్ విద్యార్థి మృతి
Published Sat, Feb 20 2016 5:56 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
Advertisement
Advertisement