
ఘోర ప్రమాదం.. పల్టీలు కొట్టిన వ్యాన్
సాక్షి, వాషింగ్టన్: ప్రమాదం ఎక్కడ జరిగిందో తెలీదు. కానీ, వ్యాన్ ప్రమాదానికి గురైన తీరు ఆశ్చర్యకరంగా ఉంది. డ్రైవర్ అదుపు తప్పిన వ్యాన్ తొలుత మళ్లీ డ్రైవర్ అదుపులోకి వచ్చినట్లు కనిపించి.. వెంటనే పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో వ్యాన్‌లో ఉన్న డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అదే రూట్‌లో వెళ్తున్న మరో వాహనంలోని వ్యక్తి వ్యాన్ ప్రమాదానికి గురైన తీరును వీడియో తీశాడు. అనంతరం సోషల్‌మీడియాలో ఈ ప్రమాద ఘటన వీడియోను పోస్టు చేయడంతో వైరల్ అయింది.