అయ్యో పాపం.. | cow falls into the van | Sakshi
Sakshi News home page

అయ్యో పాపం..

Published Fri, Sep 2 2016 11:11 PM | Last Updated on Thu, Jul 11 2019 8:56 PM

అయ్యో పాపం.. - Sakshi

అయ్యో పాపం..

– వాహనంలో తరలిస్తుండగా జారి కిందపడిన ఆవు
– కాలు విరిగి కదలలేని స్థితిలో గోమాత


చెన్నేకొత్తపల్లి : గోమాతకు కష్టమొచ్చింది. ఓ వాహనంలో తరలిస్తుండగా పట్టుతప్పి కిందపడింది. కాలు విరిగి కదలలేని స్థితిలో మిగిలింది. ఈ దశ్యం చూసిన వారంతా అయ్యోపాపం అంటూ సానుభూతి చూపారు. చెన్నేకొత్తపల్లి సమీపంలోని 44వ నంబర్‌ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. అనంతపురం నుంచి ఓ వాహనం కొన్ని పశువులతో పెనుకొండ వైపునకు బయలుదేరింది.

మార్గమధ్యంలో చెన్నేకొత్తపల్లి వద్దకు రాగానే ఓ ఆవు వాహనంలో నుంచి కిందపడిపోయింది. అటుగా వచ్చిన వారు గమనించి తీవ్రంగా గాయపడిన ఆవును రోడ్డుపక్కకు తరలించేందుకు ప్రయత్నించగా వెనుక కాలు విరిగి నడవలేని స్థితిలో పడి ఉంది. ఆ తరువాత ఉదయం 11 గంటలకు దాని యజమాని వచ్చి మరో వాహనంలో చికిత్స కోసం తరలించినట్లు స్థానికులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement