సాక్షి, హైదరాబాద్: బలహీన వర్గాలను ఆదుకోవడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందువరుసలో ఉంటుందని ఆ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ స్వామినాథన్ జానకిరామన్ అన్నారు. అవసరమైనవారికి వివిధ రూపాల్లో ఎస్‌బీఐ కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్) ద్వారా సాయం అందిస్తోందని తెలిపారు. కొండాపూర్‌లోని చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్‌కు మారుతీ ఈకో ఏడు సీట్ల వ్యాన్‌ను శుక్రవారం అందచేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్ వ్యక్తిగా సామాజికసేవ కార్యక్రమంలో పాల్గొనడం సంతృప్తి కలిగిస్తోందన్నారు. బ్యాంక్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం జూలై, ఆగస్టు నెలల్లో 75 వేల మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు స్వామినాథన్ జానకిరామన్ తెలిపారు. బ్యాంక్ సీజీఎం అమిత్ జింగ్రాన్ మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీలు, సామాజిక సంక్షేమంపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలిపారు. సుస్థిర అభివృద్ధి కార్యక్రమాలతో బలహీనవర్గాలను ఆదుకోవడానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జనరల్ మేనేజర్ ఫణీంద్రనాథ్, డిప్యూటీ జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment