
పంటపొలాల్లోకి దూసికెళ్లిన పాఠశాల వ్యాన్
- ఐదుగురు చిన్నారులకు స్వల్పగాయాలు
చండ్రుగొండ : మండల కేంద్రం చంద్రుగొండలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన వ్యాన్ శుక్రవారం సాయంత్రం అదుపుతప్పి పంటపొలాల్లోకి దూసుకెళ్లింది. వివరాలిలా ఉన్నాయి.. చంద్రుగొండలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన వ్యాన్ (టాటామేజిక్) చంద్రుగొండ నుంచి గుర్రాయిగూడెం గ్రామానికి విద్యార్థులను తీసుకెళుతుంది. మార్గమధ్యలో అదుపుతప్పి పంటపొలాల్లోకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. దీంతో గుర్రాయిగూడెం గ్రామానికి చెందిన నరెడ్ల గీతిక, సానిక అనుశ్రీ, సానికి మనోజ్‌కుమార్, గుర్రం రాజేష్, అవునూరి సాయిలకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే మిషన్ భగీరథ పైప్‌లైన్ల నిర్మాణాల కోసం తీసిన గోతుల్లోని మట్టి రోడ్డుపై ఉండటంతో రోడ్డంతా చిత్తడిగా మారింది. ఈ క్రమంలోనే వ్యాన్ అదుపుతప్పి దూసుకెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గాయపడిన విద్యార్థులను ఓ ప్రైవేట్ క్లీనిక్‌లో వైద్యచికిత్సలు అందించారు. సంఘటనా స్థలాన్ని ఎస్‌ఐ రమాకాంత్ పరిశీలించారు.