
బ్రస్సెల్స్: 2035 నుంచి పెట్రోల్, డీజిల్ కార్లు, వ్యాన్ల తయారీపై యూరోపియన్ యూనియన్ దేశాలు నిషేధం విధించనున్నాయి. ఇందుకు సంబంధించిన మొట్టమొదటి ‘ఫిట్ ఫర్ 55’ప్యాకేజీపై ఈయూ ప్రతినిధులు గురువారం అంగీకారానికి వచ్చారు. ఈ దశాబ్దం చివరికల్లా గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను 55% మేర తగ్గించడమే ఈ ప్యాకేజీ ఉద్దేశం.
దీని ప్రకారం.. కార్లు, వ్యాన్ల నుంచి వెలువడే ఉద్గారాలను 2030 నాటికి 55 శాతానికి తగ్గించి, 2035 కల్లా వందశాతం లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంది. ఒప్పందం అమల్లోకి రావాలంటే ముందుగా ఈయూ పార్లమెంట్, సభ్యదేశాలు ఆమోదం తెలిపాల్సి ఉంటుంది. 2050 నాటికి వాయు ఉద్గారాలను పూర్తిగా తగ్గించి, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహమివ్వాలని ఈయూ యోచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment