petrol and diesel variant
-
పెట్రోల్, డీజిల్ కార్ల తయారీపై... 2035 నుంచి ఈయూ నిషేధం
బ్రస్సెల్స్: 2035 నుంచి పెట్రోల్, డీజిల్ కార్లు, వ్యాన్ల తయారీపై యూరోపియన్ యూనియన్ దేశాలు నిషేధం విధించనున్నాయి. ఇందుకు సంబంధించిన మొట్టమొదటి ‘ఫిట్ ఫర్ 55’ప్యాకేజీపై ఈయూ ప్రతినిధులు గురువారం అంగీకారానికి వచ్చారు. ఈ దశాబ్దం చివరికల్లా గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను 55% మేర తగ్గించడమే ఈ ప్యాకేజీ ఉద్దేశం. దీని ప్రకారం.. కార్లు, వ్యాన్ల నుంచి వెలువడే ఉద్గారాలను 2030 నాటికి 55 శాతానికి తగ్గించి, 2035 కల్లా వందశాతం లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంది. ఒప్పందం అమల్లోకి రావాలంటే ముందుగా ఈయూ పార్లమెంట్, సభ్యదేశాలు ఆమోదం తెలిపాల్సి ఉంటుంది. 2050 నాటికి వాయు ఉద్గారాలను పూర్తిగా తగ్గించి, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహమివ్వాలని ఈయూ యోచిస్తోంది. -
తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంత తగ్గిందంటే..
పెరిగిన వంట గ్యాస్ ధరలు సామాన్యులకు గుదిబండగా మారిన తాజాగా స్వల్పంగా తగ్గిన చమురు ధరలు కాస్త ఊరటనిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా వారం రోజులుగా స్టేబుల్గా ఉన్న పెట్రోల్ ధర ఈరోజు 10 నుంచి 15 పైసలు వరకు తగ్గింది. డీజిల్ ధర సైతం 14 నుంచి 15పైసలు తగ్గింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెట్రో ధరలు ►ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ.101.34 ఉండగా డీజిల్ రూ.88.77గా ఉంది. ►ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39 ఉండగా డీజిల్ ధర రూ.96.33గా ఉంది ►కోల్ కతా లో పెట్రోల్ ధర రూ.101.72 ఉండగా డీజిల్ ధర రూ.91.84గా ఉంది. ►చెన్నైలో పెట్రోల్ ధర రూ.99.08 ఉండగా డీజిల్ ధర రూ.99.38 గా ఉంది. ►హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.40 ఉండగా, డీజిల్ రూ. 96.84 గా ఉంది. ►విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.69 గా ఉండగా, డీజిల్ ధర రూ. 98.61 గా ఉంది. ► విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.14 కాగా, డీజిల్ రూ. 98.06 గా నమోదైంది. -
పెట్రోల్, డీజిల్ వాహనాల నిషేధం అక్కర్లేదు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ వాహనాలను నిషేధించాల్సిన అవసరం లేదన్నారు కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ. ఎలక్ట్రిక్ వాహన (ఈవీ)విక్రయాలు సమజంగానే ఊపందుకుంటున్నాయని చెప్పారు. వచ్చే రెండేళ్లలో అన్ని బస్సులు ఎలక్ట్రిక్ రూపంలోనే ఉంటాయన్నారు. 2030 తర్వాత దేశంలో ఈవీ విక్రయాలనే అనుమతించాలన్నది నీతి ఆయోగ్ సిఫారసు. 150సీసీలోపు ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను 2025 తర్వాత ఈవీ రూపంలో అనుమతించాలని కూడా సిఫారసు చేసింది. కాకపోతే మంత్రులు గడ్కరీ, ధర్మేంద ప్రధాన్ వంటి వారు తర్వాత ఈ ప్రతిపాదనలను ఖండించారు. ఎంఎస్ఎంఈల్లో ఇంధన సామర్థ్యం అనే అంశంపై ఢిల్లీలో నిర్వహించిన జాతీయ సదస్సులో సోమవారం పాల్గొన్న సందర్భంగా మంత్రి గడ్కరీ ఈ అంశాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చారు. ‘‘ఎలక్ట్రిక్ కార్లు, బైక్లు, బస్సుల అమ్మకాలు సహజంగానే పెరుగుతున్నాయి. వాటి అమ్మకాలను తప్పనిసరి చేయాల్సిన అవసరం లేదు. అలాగే, పెట్రోల్, డీజిల్ వాహనాలను నిషేధించాల్సిన అవసరం కూడా లేదు. రెండేళ్లలో అన్ని బస్సులు ఎలక్ట్రిక్, బయో ఎథనాల్, సీఎన్జీతో తిరిగేవే ఉంటాయి’’ అని గడ్కరీ వివరించారు. వ్యవసాయ వ్యర్థాలు (వరిగడ్డి వంటివి) వంటి వాటితో విద్యుత్తును తయారు చేసుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. ఆ విద్యుత్తును వాహనాలకు వినియోగించుకోవడం ద్వారా, రైతుల ఆదాయం పెంచుకోవచ్చన్నారు. ప్రస్తుతం ఈ గడ్డిని రైతులు వృథాగా కాల్చేస్తున్నారని, దీనివల్ల వాయు, భూ కాలుష్యం పెరుగుతున్నట్టు చెప్పారు. ఎన్టీపీసీ సంస్థ ద్వారా ఇప్పటికే ఈ తరహా వ్యర్థాల సమీకరణను ప్రారంభించినట్టు తెలిపారు. ఎంస్ఎంఈలకు తక్కువ రేటుకు రుణాలు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈలు) తక్కువ రేటుకే రుణాలు అందించేందుకు గాను ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులతో ఒప్పందాలు చేసుకున్నట్టు నితిన్ గడ్కరీ తెలిపారు. ‘‘అధిక మూలధన వ్యయ సమస్య ఉంది. ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు 2–3 శాతంగా ఉన్నాయి. కొన్ని దేశాల్లో అయితే ఒక్క శాతమే. కానీ, మన దేశంలో ఎంఎస్ఎంఈ రుణాలపై 11–14 శాతం వరకు వడ్డీ రేట్లు అమలవుతున్నాయి. నిధుల వ్యవయాలను తగ్గించాల్సిన అవసరం ఉంది’’ అని వివరించారు. రవాణా వ్యయాలను తగ్గించగలిగితే ఎగుమతులు ప్రస్తుత స్థాయికి రెట్టింపునకు పైగా పెరుగుతాయన్నారు. -
మారుతీ ఇగ్నిస్ వచ్చేసింది
పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభ్యం • ధర రూ.4.59 లక్షల నుంచి రూ.7.8 లక్షల రేంజ్లో ముంబై: మారుతీ సుజుకీ ఇండియా కంపెనీ.. ప్రీమియమ్ కాంపాక్ట్ వెహికల్, ఇగ్నిస్ను శుక్రవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. డీజిల్, పెట్రోల్ వేరియంట్లలో లభించే ఈ కార్ల ధరల్ని రూ.4.59 లక్షల నుంచి రూ.7.8 లక్షల రేంజ్లో (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) నిర్ణయించామని మారుతీ సుజుకీ తెలిపింది. తమ ప్రీమియమ్ రిటైల్ చెయిన్ నెక్సా ద్వారా ఇగ్నిస్ కార్లను విక్రయిస్తామని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈఓ కెనిచి అయుకవ చెప్పారు. సిగ్మా, డెల్టా, డెల్టా ఏఎంటీ, జెటా, జెటా ఏఎంటీ, ఆల్ఫా వేరియంట్లలో, మొత్తం తొమ్మిది విభిన్నమైన రంగుల్లో ఈ కారు లభ్యమవుతుందని వివరించారు. 1.2 పెట్రోల్ ఇంజిన్ ఉన్న ఇగ్నిస్ కారు ధరలు రూ.4.59 లక్షలు–రూ.6.69 లక్షల రేంజ్లో, 1.3 డీజిల్ ఇంజిన్ ఇగ్నిస్ కారు ధరలు రూ.6.39 లక్షలు–రూ.7.8 లక్షల రేంజ్లో ఉన్నాయని పేర్కొన్నారు. యువ వినియోగదారులు లక్ష్యంగా అందిస్తున్న ఈ ఇగ్నిస్ కారులో 98.5% స్థానిక విడిభాగాలనుపయోగించామని, ఈ కారు డిజైనింగ్, తయారీ కోసం రూ.950 కోట్లు వెచ్చించినట్లు వివరించారు. పెట్రోల్ మోడల్ 20.89 కిమీ, డీజిల్ మోడల్ 26.80 కి.మీ. మైలేజీని ఇస్తాయని తెలిపారు. 2020 కల్లా భారత్లో 15 కొత్త మోడళ్లను అందిస్తామని పేర్కొన్నారు. అప్పటికి ఏటా 20 లక్షల కార్లను విక్రయించాలనేది తమ మధ్యకాలిక లక్ష్యమని తెలిపారు. మారుతీ ఇగ్నిస్ ప్రత్యేకతలు.. ప్రయాణికులకు మరింత భద్రత నిచ్చే కొత్త జనరేషన్ రిజిడ్ ప్లాట్ఫార్మ్.. టోటల్ ఎఫెక్టివ్ కంట్రోల్ టెక్నాలజీ(టెక్ట్) ప్లాట్ఫార్మ్పై ఇగ్నిస్ ను రూపొందించామని కంపెనీ పేర్కొంది. ఆటో గేర్ షిఫ్ట్ ఫీచర్, డ్యుయల్ ఎయిర్బ్యాగ్స్, ఈబీడీతో కూడిన యాంటీలాక్బ్రేకింగ్ సిస్టమ్(ఏబీఎస్), పిల్లల కోసం ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ ఫీచర్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, డే టైమ్ రన్నింగ్లైట్స్, ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్లున్నాయి.