రోడ్డుప్రమాదంలో ఎస్బీఐ ఉద్యోగుల దుర్మరణం
ఏడుగురు ఎస్బీఐ ఉద్యోగుల దుర్మరణం
Published Thu, Nov 10 2016 7:57 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాన్పూరు -అమీర్‌పూర్ హైవేపై బుధవారం అర్థరాత్రి జరిగిన దుర్ఘటనలో ఏడుగురు ఎస్బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఉద్యోగులు దుర్మరణం పాలయ్యారు. వీరంతా గాటంపూర్‌లో విధులు ముగించుకుని మారుతి ఒమ్ని వ్యానులో వస్తుండగా వేగంగా వచ్చిన ట్రక్కు కంటెయినర్ ఢీ కొట్టింది.
దాంతో ఒమ్ని వ్యాను అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. అనంతరం కంటెయినర్ వ్యాన్ మీద పడిపోయింది. మారుతి ఒమ్నిలోని ప్రయాణిస్తున్నవారంతా అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్తో పాటు ఫీల్డ్ అధికారి, అసిస్టెంట్ మేనేజర్సు, వ్యాన్ డ్రైవర్ ఉన్నారు. మరోవైపు కంటెయినర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కాగా క్రేన్ సాయంతో మృతదేహాలను బయటకు తీసి పోస్ట్మార్టంకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement