మనీలా: ఫిలిప్పీన్స్ దేశంలో ఘోర ప్రమాదం జరిగింది. పసిఫిక్ మహాసముద్రంలో ప్రయాణిస్తున్న ఓ నౌకలో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో దాదాపు 31 మంది మృతిచెందారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్ సముద్రంలో సహాయక చర్యలు చేపట్టింది.
వివరాల ప్రకారం.. లేడీ మేరీ జాయ్-3 నౌక మిండానావో ద్వీపంలోని జాంబోంగా సిటీ నుంచి సులు ప్రావిన్స్‌లోని జోలో ద్వీపానికి బుధవారం అర్ధరాత్రి(భారత కాలమానం ప్రకారం) అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 31 మంది మరణించినట్టు బాసిలన్ గవర్నర్ జిమ్ సల్లిమాన్ తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు.
అయితే, నౌకలో అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులు నీటిలో దూకేశారని అన్నారు. ప్రమాద సమయంలో నౌకలో 250 మంది ప్రయాణికులు ఉన్నట్టు స్పష్టం చేశారు. ప్రమాదం తర్వాత ఫిలిప్పీన్ కోస్ట్ గార్డ్, మత్స్యకారులు కలిసి 195 మందిని కాపాడినట్టు వెల్లడించారు. కాగా, మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని తెలిపారు. కాగా, అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: అయ్యో పాకిస్తాన్.. రంజాన్ వేళ దారుణ పరిస్థితులు!
Comments
Please login to add a commentAdd a comment