ఫిలిప్పీన్స్‌లో అగ్నిప్రమాదం.. 37 మంది మృతి | BPO group seeks justice for dead colleagues trapped in Davao mall fire | Sakshi
Sakshi News home page

ఫిలిప్పీన్స్‌లో అగ్నిప్రమాదం.. 37 మంది మృతి

Published Mon, Dec 25 2017 4:49 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

BPO group seeks justice for dead colleagues trapped in Davao mall fire - Sakshi

దావో: ఫిలిప్పీన్స్‌లో తుపాను ఉధృతి మరవకముందే మరో పెనుప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని దావో నగరంలో ఉన్న ఎన్‌సీసీసీ షాపింగ్‌ మాల్‌లో శనివారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 37 మంది మరణించారు. మాల్‌లో మూడో అంతస్తులో ఉన్న ఫర్నిచర్‌ దుకాణంలో తొలుత మంటలు అంటుకున్నాయని పోలీసులు వెల్లడించారు. మాల్‌లో పై అంతస్తులో ఉన్న కాల్‌సెంటర్‌లో విధులు నిర్వహించే వారంతా మరణించి ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రమాదవార్త తెలిసిన వెంటనే ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటర్టే ఘటనాస్థలికి చేరుకుని మృతుల బంధువులను పరామర్శించారు. మరోవైపు ఫిలిప్పీన్స్‌ను వణికిస్తున్న తుపాను ధాటికి మరణించిన వారి సంఖ్య 200 దాటింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement