బీజింగ్: నైరుతి చైనాలోని గిజౌప్రావీన్స్‌లో పడవ బోల్తా పడటంతో సుమారు 10 మంది మృతి చెందారని, ఐదుగురు గల్లంతు అయినట్లు అధికారులు ధృవీకరించారు. ఈ ఘటన లియుపాన్షుయ్ నగరంలోని జాంగే నదిలో చోటు చేసుకుందని. ప్రమాదానికి గురైన పడవ 40 మంది ప్రయాణికుల సామర్థ్యంతో ప్రయాణించ గలిగే విధంగా రూపొందించినట్లు అధికారులు తెలిపారు.
(చదవండి: ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నారు)
ఈ క్రమంలో ఆ పడవలో ఎంతమంది ప్రయాణించారు అనేది ఇంకా స్పష్టం కాలేదని, ప్రయాణికులంతా విద్యార్థులేనని గుర్తించారు. ఈ ఘటన జరిగిన వెంటనే 17 రెస్య్కూ టీంలు 50 బోట్‌లతో సహా ప్రయాణికులను కాపాడే ఆపరేషన్‌లు చేపట్టారని, అధికారులు ఈ ప్రమాదానికి గల కారణాలు గురించి అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు చైనా జిన్హువా న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.
(చదవండి: ఆ విమానాలను పునరుద్ధరిస్తున్నాం: బైడెన్)
Comments
Please login to add a commentAdd a comment