Guizhou Province
-
చైనాలో 24 కోట్ల ఏళ్ల డ్రాగన్ శిలాజం
ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రదేశాల్లో శిలాజాలు బయటపడుతుంటాయి. వందల సంవత్సరాల క్రితం భూమిలో కూరుకుపోయిన జీవులు క్రమంగా శిలాజంగా మారుతుంటాయి. అయితే, చైనాలో 2003లో బయటపడిన భారీ డ్రాగన్ శిలాజం వయసు 24 కోట్ల సంవత్సరాలు ఉంటుందని సైంటిస్టులు తాజాగా నిర్ధారించారు. ఇంత వయసున్న డ్రాగన్ శిలాజం వెలుగుచూడడం ఇదే మొదటిసారి అని నేషనల్ మ్యూజియమ్స్ స్కాట్లాండ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. చైనాలో ట్రియాసిక్ కాలానికి చెందిన ఈ శిలాజం భాగాలను తొలుత 2003లో దక్షిణ చైనాలోని గిజౌ ప్రావిన్స్‌లో గుర్తించారు. గత పదేళ్లలో తవ్వకాల్లో మరిన్ని భాగాలు బయటపడ్డాయి. వాటన్నింటినీ ఒకేచోట అమర్చగా అది ఐదు మీటర్ల డ్రాగన్‌గా తేలింది. 24 కోట్ల ఏళ్ల క్రితమే అది శిలాజంగా మారిపోయిందని పరిశోధకులు కనిపెట్టారు. దీనికి డైనోసెఫాలోసారస్ ఒరియంటలిస్ అని పేరుపెట్టారు. ముక్కు నుంచి తోక దాకా పూర్తి శిలాజాన్ని ఆవిష్కరించామని ఎన్ఎంఎస్ సైంటిస్టు డాక్టర్ నిక్ ఫ్రాసెర్ చెప్పారు. ఇది 8 అంకె ఆకారంలో ఉందని, చైనా డ్రాగన్లను గుర్తుకు తెస్తోందని వివరించారు. డ్రాగన్ కాల్పనిక జీవి కాదని, నిజంగానే ఉండేదని చెప్పడానికి ఈ శిలాజం ఒక ఆధారమని సైంటిస్టులు అంటున్నారు. రాక్షస బల్లుల తరహాలో వాతావరణ మార్పుల కారణంగా కోట్ల సంవత్సరాల క్రితం అవి అంతరించిపోయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, చైనాలో బయటపడిన డ్రాగన్ శిలాజం మెడ చాలా పొడవుగా ఉండడం ఆసక్తి కలిగిస్తోంది. నదులు, చెరువుల్లో చేపలు పట్టుకోవడానికి వీలుగా దాని మెడ పొడవుగా సాగి ఉండొచ్చని భావిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చైనాలో పడవ బోల్తా.. 10 మంది మృతి
బీజింగ్: నైరుతి చైనాలోని గిజౌప్రావీన్స్‌లో పడవ బోల్తా పడటంతో సుమారు 10 మంది మృతి చెందారని, ఐదుగురు గల్లంతు అయినట్లు అధికారులు ధృవీకరించారు. ఈ ఘటన లియుపాన్షుయ్ నగరంలోని జాంగే నదిలో చోటు చేసుకుందని. ప్రమాదానికి గురైన పడవ 40 మంది ప్రయాణికుల సామర్థ్యంతో ప్రయాణించ గలిగే విధంగా రూపొందించినట్లు అధికారులు తెలిపారు. (చదవండి: ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నారు) ఈ క్రమంలో ఆ పడవలో ఎంతమంది ప్రయాణించారు అనేది ఇంకా స్పష్టం కాలేదని, ప్రయాణికులంతా విద్యార్థులేనని గుర్తించారు. ఈ ఘటన జరిగిన వెంటనే 17 రెస్య్కూ టీంలు 50 బోట్లతో సహా ప్రయాణికులను కాపాడే ఆపరేషన్లు చేపట్టారని, అధికారులు ఈ ప్రమాదానికి గల కారణాలు గురించి అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు చైనా జిన్హువా న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. (చదవండి: ఆ విమానాలను పునరుద్ధరిస్తున్నాం: బైడెన్) -
చైనాలో భారీ వర్షాలు.. 28 మంది మృతి
బీజింగ్: చైనాలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 28 మంది మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. వాయువ్య చైనా గుయ్జోవ్ ప్రావిన్స్‌లోని ఓ గ్రామంలో శుక్రవారం పెద్ద కొండచరియ విరిగిపడి 20 మంది మృత్యువాత పడ్డారని అధికారులు వెల్లడించారు. మరో ఘటనలో మధ్య చైనాలోని హుబెయ్ ప్రావిన్స్‌లో ఉన్న వుహన్ గ్రామంలో శనివారం కురిసిన భారీ వర్షానికి ఓ పరిశ్రమ గోడ కూలి 8 మంది మృతి చెందారని స్థానిక అధికారులు చెప్పారు. దఫాంగ్లోని పియాన్పో గ్రామంలో భారీ వర్షానికి కొండచరియ విరిగిపడి ముగ్గురు గల్లంతయ్యారు. దక్షిణ చైనాలో జూన్ 27 నుంచి వర్షాలు, తుఫానులు బీభత్సం సృష్టిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 34 మంది మృతిచెందారని ఆ దేశ పౌర వ్యవహారాల శాఖ వెల్లడించింది. నదులు ఉప్పొంగడం వల్ల రాత్రికి రాత్రి 12 వేల మందిని పునరావాస ప్రాంతాలకు తరలించామని హుబై ప్రావిన్స్ విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. ‘దేశవ్యాప్తంగా 12 వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. 40 వేల మంది సహాయం కోసం వేచి చూస్తున్నారు. 3,600 ఇళ్లు కూలిపోయాయి. 19,900 హెక్టార్లలోని పంట నాశనమైంది’ అని చైనా ప్రభుత్వం వెల్లడించింది.