
సాక్షి, నల్గొండ : నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు వెళ్లాల్సిన బోటు ప్రయాణాన్ని అధికారులు శనివారం నిలిపివేశారు. గిరాకీ లేకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఇటీవల గోదావరిలో కచ్చలూరు వద్ద జరిగిన ఘోర ప్రమాదంతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బోటు సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాగర్ టు శ్రీశైలం బోటు ప్రయాణానికి కేంద్ర పర్యాటక శాఖ అనుమతులిచ్చినా ప్రయాణీకులు ఆసక్తి చూపడం లేదు. లాంచీ ప్రయాణం అంటేనే ప్రయాణీకులు హడలిపోతున్న ప్రస్తుత పరిస్థితులలో టిక్కెట్లు అమ్ముడుపోక టూర్‌ను రద్దు చేస్తున్నట్లు పర్యాటక శాఖ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment