‘పుష్ప’ ఆ యాక్షన్‌ సిక్వెన్స్‌ హైలెట్‌.. | allu arjun action fight in boat travelling | Sakshi
Sakshi News home page

‘పుష్ప’ ఆ యాక్షన్‌ సిక్వెన్స్‌ హైలెట్‌..

Published Mon, Jun 14 2021 1:59 AM | Last Updated on Mon, Jun 14 2021 8:09 AM

allu arjun action fight in boat travelling - Sakshi

పడవ ప్రయాణం చేశారట అల్లు అర్జున్‌. ఇది మనసుకి ఉల్లాసాన్నిచ్చే ప్రయాణం కాదు. శత్రువులకు పంచ్‌లు ఇచ్చే ప్రయాణం అని టాక్‌. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘పుష్ప’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఇందులో పుష్పరాజ్‌ పాత్ర పోషిస్తున్నారు అల్లు అర్జున్‌.

రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్‌ కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా ఆగిపోయింది. ఆ సంగతలా ఉంచితే.. ఇందులో పడవ ప్రయాణం బ్యాక్‌డ్రాప్‌లో ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ ఉంటుందట. ఈ సీన్స్‌ ‘పుష్ప’ సినిమాలో వన్నాఫ్‌ ది హైలైట్స్‌గా ఉంటాయనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. మలయాళ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement