image credit: Newatlas
విద్యుత్ వాహనాల(ఈవీల) వినియోగం పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రజల్లో ఇప్పుడిప్పుడే వీటిపై అవగాహన పెరుగుతోంది. రానున్న రోజుల్లో వీటి వినియోగం మరింత హెచ్చవుతుందని భావిస్తున్నారు. అయితే ఈవీలు కేవలం రోడ్లకే పరిమితం కాకుండా నీటిలో సముద్రంపై వాటి మార్కును నిలుపుకోనున్నాయి. చాలా కంపెనీలు నీటిలో వినియోగించే చిన్నబోట్‌లను నడిపేందుకు సైతం విద్యుత్తును వినియోగించేలా పరిశోధనలు సాగిస్తున్నాయి.
ఆ పరిశోధనల్లో భాగంగా అమెరికాకు చెందిన ‘క్రౌలి’ సంస్థ ‘ఈ-వోల్ఫ్’ అనే షిప్పింగ్ వెజెల్‌ను తయారుచేసింది. 70 టన్నులు మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన ఈ వెజెల్ 82 అడుగుల పొడవు ఉంటుంది. దీన్ని క్రౌలికు చెందిన ఇంజినీర్లు మాస్టర్‌బోట్ బిల్డర్స్ షిప్‌యార్డ్‌లో రూపొందించినట్లు తెలిసింది. ఇందులో ప్రయాణించే వారికి చుట్టూ(360 డిగ్రీ వ్యూ) ప్రదేశాలు కనిపించేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది.
ఈ వెజెల్‌ను ఈ ఏడాది చివర్లో శాన్ డియాగో పోర్ట్‌లో విధుల్లో ప్రవేశపెట్టనున్నారు. దీన్ని తీరప్రాంతంలో పెట్రోలింగ్ కోసం వినియోగంచనున్నట్లు సమాచారం. ఈ వెజెల్‌లో 6.2 మెగావాట్ హవర్ మాడ్యులర్ బ్యాటరీ సిస్టమ్‌ను అమర్చారు. ఇది దాదాపు గంటకు 30 కిలోమీటర్లు గరిష్ట వేగంతో ప్రయాణించగలదు. 2,100 కిలోవాట్ శక్తినిచ్చే రెండు థ్రస్టర్ మోటార్‌లతో కూడిన ప్రొపల్షన్ సిస్టమ్‌కు అమర్చారు. అయితే ఇందులో అత్యవసర సమయాల్లో బ్యాటరీ అయిపోయినా మరింత దూరం ప్రయాణించడానికి వీలుగా రెండు చిన్న డీజిల్ జనరేటర్‌లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిసింది. దీన్ని భవిష్యత్తులో రాబోయే టెక్నాలజీకు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.
ఇదీ చదవండి: చిన్న పరికరం.. పెద్ద ప్రయోజనం - వీడియో
సాన్‌డియాగో పోర్ట్ తీరప్రాంతంలో మైక్రోగ్రిడ్ ఛార్జింగ్, స్టోరేజ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసిన తర్వాత ఈ ఏడాది చివర్లో ఈ-వోల్ఫ్ సేవలు వినియోగించుకోనున్నారు. సాంప్రదాయ వెజెల్‌తో పోలిస్తే ఇది మొదటి 10 సంవత్సరాల కాలంలో 2.5 టన్నుల డీజిల్ పార్టికల్స్, 3,100 మెట్రిక్ టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ను ఆదా చేస్తుందని క్రౌలీ తెలిపింది. సముద్రగర్భంలో ఏర్పడుతున్న శబ్దకాలుష్యం వల్ల జీవులకు ఎంతో హానికలుగుతుందని అయితే అది ఈవీ బోట్‌లతో నివారించవచ్చని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment