ప్రపంచంలో అతిపెద్ద పగడం | Scientists Discover World Largest Coral In Southwest Pacific Ocean, More Details Inside | Sakshi
Sakshi News home page

ప్రపంచంలో అతిపెద్ద పగడం

Published Fri, Nov 15 2024 6:06 AM | Last Updated on Fri, Nov 15 2024 10:25 AM

Scientists discover world largest coral

పసిఫిక్‌ మహాసముద్రంలో గుర్తించిన సైంటిస్టులు  

ఏకంగా 100 అడుగులకు పైగా పొడవైన పగడాన్ని(కోరల్‌)ను నైరుతి పసిఫిక్‌ మహాసముద్రంలో సైంటిస్టులు గుర్తించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పగడం అని చెబుతున్నారు. 300 ఏళ్ల క్రితం ఏర్పడిన ఈ పగడం అంతరిక్షం నుంచి కూడా కనిపిస్తుందని అంటున్నారు. నేషనల్‌ జియోగ్రాఫిక్‌ ప్రిస్టీన్‌ సీస్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా గత నెలలో సోలోమాన్‌ దీవుల్లో సముద్ర స్థితిగతులను అధ్యయనం చేయడానికి బయలుదేరిన సైంటిస్టులకు ఈ పగడం కనిపించింది. 

గతంలో అమెరికాలో సమోవాలో గుర్తించిన భారీ పగడం కంటే ఇది మూడు రెట్లు పెద్దది కావడం విశేషం. అంతేకాదు భూమిపై అతిపెద్ద జంతువైన బ్లూవేల్‌ కంటే కూడా పొడవైనది. సాధారణంగా సముద్రాల అంతర్భాల్లో పగడపు దిబ్బలు ఏర్పడతాయి. ఈ దిబ్బల్లో చిన్నచిన్న పగడాలు కనిపిస్తాయి. కానీ, నైరుతి పసిఫిక్‌ మహాసముద్రంలో తాజాగా గుర్తించి పగడం సింగిల్‌ కోరల్‌ కావడం గమనార్హం. కొన్ని శతాబ్దాలుగా దీని పరిమాణం పెరుగుతున్నట్లు గుర్తించారు.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement