National Geographic
-
ప్రపంచంలో అతిపెద్ద పగడం
ఏకంగా 100 అడుగులకు పైగా పొడవైన పగడాన్ని(కోరల్)ను నైరుతి పసిఫిక్ మహాసముద్రంలో సైంటిస్టులు గుర్తించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పగడం అని చెబుతున్నారు. 300 ఏళ్ల క్రితం ఏర్పడిన ఈ పగడం అంతరిక్షం నుంచి కూడా కనిపిస్తుందని అంటున్నారు. నేషనల్ జియోగ్రాఫిక్ ప్రిస్టీన్ సీస్ ప్రోగ్రామ్‌లో భాగంగా గత నెలలో సోలోమాన్ దీవుల్లో సముద్ర స్థితిగతులను అధ్యయనం చేయడానికి బయలుదేరిన సైంటిస్టులకు ఈ పగడం కనిపించింది. గతంలో అమెరికాలో సమోవాలో గుర్తించిన భారీ పగడం కంటే ఇది మూడు రెట్లు పెద్దది కావడం విశేషం. అంతేకాదు భూమిపై అతిపెద్ద జంతువైన బ్లూవేల్ కంటే కూడా పొడవైనది. సాధారణంగా సముద్రాల అంతర్భాల్లో పగడపు దిబ్బలు ఏర్పడతాయి. ఈ దిబ్బల్లో చిన్నచిన్న పగడాలు కనిపిస్తాయి. కానీ, నైరుతి పసిఫిక్ మహాసముద్రంలో తాజాగా గుర్తించి పగడం సింగిల్ కోరల్ కావడం గమనార్హం. కొన్ని శతాబ్దాలుగా దీని పరిమాణం పెరుగుతున్నట్లు గుర్తించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వందేళ్ల క్రితం ఎవరెస్ట్‌పై గల్లంతు
లండన్: ప్రపంచంలోనే అతి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే క్రమంలో జాడ తెలియకుండా పోయిన బ్రిటిష్ పర్వతారోహకుడి ఆనవాళ్లు తాజాగా వందేళ్లకు బయటపడ్డాయి. నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీ బృందంలోని పర్వతారోహకులకు 1924లో కనిపించకుండా పోయిన ఇద్దరిలో ఎ.సి.ఇర్విన్(22) పాదం, బూటు, ఆయన పేరున్న ఎంబ్రాయిడరీ సాక్స్ దొరికాయి. ఇది తెలిసి ఇర్విన్ సోదరుని కుమార్తె ఆనందం వ్యక్తం చేశారు. దీంతోపాటు, ఎడ్మండ్ హిల్లరీ, టెన్జింగ్ నార్గే కంటే 29 ఏళ్ల ముందే ఎవరెస్ట్ అధిరోహించేందుకు వెళ్లిన ఈ ఇద్దరూ తమ ప్రయత్నంలో విజయం సాధించారా లేదా అన్న అనుమానాలకు తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీ బృందం ఈ ఏడాది సెప్టెంబర్‌లో చైనా ఆదీనంలోని ఎవరెస్ట్ ఉత్తర ప్రాంతంలో రొంగ్బుక్ గ్లేసియర్ వద్ద చిత్రీకరణ చేపట్టింది. ఈ బృందానికి ఆస్కార్ విజేత కూడా ప్రముఖ జిమ్మీ చిన్ నాయకత్వం వహిస్తున్నారు. అక్కడ వారికి 1933 నాటి ఆక్సిజన్ సిలిండర్ ఒకటి లభ్యమైంది. ఇర్విన్‌కు సంబంధించిన వస్తువు కూడా ఒకటి దొరికింది. దీంతో, చాలా రోజులు అక్కడే అన్వేషణ జరిపారు. ఫలితంగా వారికి ఓ కాలున్న బూట్ దొరికింది. అందులోని సాక్ ఎంబ్రాయిడరీపై ‘ఎ.సి.ఇర్విన్’అనే పేరుంది. ఈ బూటును 1924 జూన్‌లో జార్జి మల్లోరీతో కలిసి ఎవరెస్ట్ అధిరోహించేందుకు వచ్చి అదృశ్యమైన బ్రిటిష్ దేశస్తుడు ఏసీ శాండీ ఇర్విన్దేనని తేల్చారు. 1999లో మల్లోరీ మృతదేహం పర్వతారోహకుల కంటబడగా, ఇర్విన్ ఆనవాళ్లు ఇప్పటికీ దొరకలేదు. అయితే, ఈయన వెంట తెచ్చుకున్న కెమెరా కోసం పలువురు గతంలో తీవ్రంగా గాలించారు. అందులోని ఫొటోల ఆధారంగా ఈ ఇద్దరు సాహసికుల ప్రయత్నం ఏమేరకు ఫలించిందన్న ప్రశ్నకు సమాధానం దొరుకుతుందని వారి ఆశ. తాజాగా దొరికిన ఆధారంతో ఇర్విన్ మృతదేహం వంటి ఆనవాళ్లు అదే ప్రాంతంలో దొరకవచ్చన్న అంచనాలు పెరిగిపోయాయి. -
World Photography Day: వారియర్ కెమెరా: కర్తవ్యాన్ని గుర్తు చేసే కెమెరా కన్ను
ఆరతి కెమెరాతో మాట్లాడి చూడండి... చేపల సవ్వడి లేని నదుల దీనత్వాన్ని గురించి చెబుతుంది. చేవ లేని జీవజాలాన్ని గురించి చెబుతుంది. పచ్చదనాన్ని కోల్పోయి నేలకూలనున్న నిర్జీవ వృక్షాల మృత్యుఘోష చెబుతుంది. నదుల నీటిలోని విషాన్ని గురించి వివరంగా చెబుతుంది. స్థూలంగా చెప్పాలంటే...కనిపించే అందాల వెనుక కనిపించిన నిశ్శబ్ద విధ్వంసాన్ని గురించి కళ్లకు కడుతూ చెబుతుంది. బెంగళూరుకు చెందిన ఎన్విరాన్మెంటల్ ఫొటోగ్రాఫర్ ఆరతి కుమార్ రావు తన కెమెరాతో పర్యావరణ సంరక్షణం గురించి క్షణం క్షణం గుర్తు చేస్తోంది... ప్రతి కెమెరాకు ఒక దృష్టి ఉంటుంది. మరి ఆరతి కెమెరా చూసేది ఏమిటి? అట్టడుగున పడి కన్పించని కథలు, నిజజీవిత కథలు, పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నా ఎవరూ పట్టించుకోని కథలు, సంప్రదాయ జీవనశైలులు, వాటిలో వస్తున్న అనూహ్య మార్పులు, పదాలకు దొరకని దృశ్యాలు...ఇలా ఎన్నో ఎన్నెన్నో. చిన్నప్పటి నుంచి ‘నేషనల్ జియోగ్రఫి’ పత్రికలను చూస్తూ పెరిగింది ఆరతి. ఆ ఎల్లో బార్డర్ విండోస్ నుంచి విశాలమైన ప్రపంచాన్ని చూసింది. ఆ పత్రికలోని ఫొటోగ్రాఫ్స్ తనపై ఎంతో ప్రభావం చూపాయి. పదాలతోనే కాదు చిత్రాలతో కూడా గొప్ప సత్యాలు చెప్పవచ్చుననే విషయం అర్థమైంది. చిన్నప్పటి నుంచి ఫిజిక్స్ అంటే ఇష్టం ఉన్న ఆరతి బయోఫిజిక్స్లో మాస్టర్స్ చేసింది. ఆ తరువాత ‘లైఫ్‌టైమ్ టు–డూ’ రూపంలో భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసుకుంది. దానిలో నదులతో పరిచయం ఒకటి. నదులను, వాటి చుట్టూ ఉండే జీవితాన్ని ఫొటోల రూపంలో డాక్యుమెంట్ చేయాలనుకుంది. కాళ్లకు బలపాలు, కళ్లకు కెమెరాలు కట్టుకొని ఊరూరు తిరిగినా తల్లిదండ్రులు ఎప్పుడూ అభ్యంతర పెట్టలేదు. పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. వివిధ ప్రాంతాలలో తన ఫొటోగ్రఫీకి సంబంధించిన విషయాలను కుటుంబసభ్యులతో పంచుకునేది ఆరతి. ఫొటోల ద్వారా ఎన్విరాన్మెంటల్ స్టోరీ టెల్లింగ్‌లో నేర్పు సంపాదించిన ఆరతి తన ప్రయాణంలో ఎన్నో అనుభవాలను సొంతం చేసుకుంది. పర్యావరణం గురించి మాట్లాడే వారిని అభివృద్ధి వ్యతిరేకులుగా భావించే వారిని కూడా చూసింది. ‘రివర్ డైరీస్’ అనేది ఆమె ప్రస్థానంలో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్‌గా పేరు తెచ్చుకుంది. నదుల అందాలతో పాటు వాటికి ఎదురవుతున్న ఆపదలకు ‘రివర్ డైరీస్’ అద్దం పడతాయి. ‘హింస, వివాదాలు మాత్రమే హెడ్‌లైన్‌గా కనిపిస్తాయి. అయితే పర్యావరణ విధ్వంసం అనే భయానకమైన కనిపించని హింస చాపకింద నీరులా కొనసాగుతుంది’ అంటుంది ఆరతి. ఆ కనిపించని హింసమూలాలను నలుగురికి తెలియజేసేలా చేయడంలో తన కెమెరాను బలమైన మాధ్యమంగా ఉపయోగించుకుంటోంది. ఆరతి ఫొటోగ్రాఫర్ మాత్రమే కాదు రచయిత్రి కూడా. ఆమె పుస్తకాలలో ‘మార్జిన్‌ల్యాండ్స్: ఇండియన్ ల్యాండ్‌స్కేప్స్ ఆన్ ది బ్రింక్’ ఒకటి. ఇందులో లడఖ్ నుంచి సుందరబన్ వరకు ప్రకృతికి సంబంధించిన ఎన్నో సుందరచిత్రాలను కళ్లకు కడుతుంది. గంగ– బ్రహ్మపుత్ర–మేఘన పరీవాహక ప్రాంతాలకు తీసుకువెళుతుంది. భౌగోళిక అందాలతో పాటు ఎదురవుతున్న ప్రమాదాలను, అక్కడి ప్రజలు మాట్లాడుకునే పదాలను పరిచయం చేస్తుంది. ‘నిర్మాణాలు, ఇతరత్రా విధ్వంసక కార్యకలాపాల వల్ల ప్రమాదం అంచున ఉన్న ప్రకృతిని కాపాడు కోవడం అనేది మన చేతిలోనే ఉంది’ అని ఈ పుస్తకం ద్వారా చెబుతుంది ఆరతి. ‘పర్యావరణంలో వచ్చే మార్పులు, అవి మన జీవితాల్లో తెచ్చే మార్పులను నా కెమెరా ద్వారా ఇక ముందు కూడా కథలుగా చెప్పాలనుకుంటున్నాను’ అంటోంది ఆరతి. ఒకానొక సందర్భంలో తన నిరసన గళాన్ని ఇలా వినిపించింది ఆరతి,,,, ‘కరువుకాటకాలు, వరదలలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మాత్రమే పర్యావరణ విధ్వంసం, పరిరక్షణ గురించి మాట్లాడుకుంటారు. ఆ తరువాత ఎవరి పనుల్లో వారు మునిగిపోతారు’ అయితే ఆరతిలాంటి ఎన్విరాన్మెంటల్ ఫొటోగ్రాఫర్లు తమ చిత్రాల ద్వారా పర్యావరణ పరిరక్షణకు సంబంధించి మన కర్తవ్యాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉన్నారు. -
‘డ్యాన్స్ ఆఫ్ ది ఈగల్’.. 5 వేల ఫోటోలను దాటి విజేతగా నిలిచింది
నేషనల్ జియోగ్రాఫిక్ ‘పిక్చర్ ఆఫ్ ది ఇయర్’ పోటీలో విజేతగా నిలిచిన చిత్రమిది. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో భారతీయ సాఫ్ట్వేర్ డెవలపర్, ఫోటోగ్రాఫర్ కార్తీక్ సుబ్రమణియన్ ఈ ఫోటో తీశారు. అలాస్కాలోని చిల్కాట్ బాల్డ్ ఈగల్ అభయారణ్యంలో తీసిన ఈ ఫోటోకు ‘డ్యాన్స్ ఆఫ్ ది ఈగల్’ అని పేరు పెట్టారు. ప్రకృతి, ప్రజలు, ప్రాంతాలు, ప్రాణులు కేటగిరీలో వచ్చిన 5000 ఫోటోల్లోంచి చివరికి దీన్ని ఎంపిక చేసినట్లు సంస్థ తెలిపింది. ఈ పోటీలో గుర్తింపు పొందిన కొన్ని ఫోటోలుపై ఓ లుక్కేద్దాం. -
వారెవ్వా! ఓ వైపు సూర్యోదయం, మరో వైపు నిండుచంద్రుడు.. ఈ ఫొటో కోసం 2వేల సార్లు
రెప్పపాటులో అదృశ్యమైపోయే దృశ్యాలు కొన్ని మనకు తారసపడుతూ ఉంటాయి. అలాంటి దృశ్యాలను శాశ్వతంగా పదిలపరచుకోవాలంటే, అందుకు కెమెరా ఒక చక్కని సాధనం. అలాగని కెమెరా చేతిలో ఉంటే సరిపోదు. కనిపించిన దృశ్యాన్ని పదికాలాల పాటు నిలిచి ఉండేలా ఫొటో తీయడానికి ఎంతో సహనం, అంతకు మించిన సమయస్ఫూర్తి కావాలి. ఎంతో సహనంతో సమయస్ఫూర్తితో చాకచక్యంగా తీసిన ఫొటోల్లో కొన్ని అద్భుత చిత్రాలుగా నిలిచిపోతాయి. ‘నేషనల్ జాగ్రఫిక్’ 2022 సంవత్సరంలో అత్యుత్తమ చిత్రాలుగా ప్రకటించిన కొన్ని ఫొటోలు ఇవి... ఓ వైపు సూర్యోదయం, మరోవైపు చంద్రుడు ఒకవంక సూర్యోదయం, మరోవంక మబ్బుచాటు నిండుచంద్రుడు. రేయింబగళ్ల సంధికాలాన్ని ఒకే దృశ్యంలో బంధించిన అద్భుత చిత్రం ఇది. అమెరికన్ ఫొటోగ్రాఫర్ స్టీఫెన్ విల్కిస్ ఈ ఫొటో తీయడానికి పురాతన సిటడల్ శిఖరంపైకి చేరుకుని 2,092 ప్రయత్నాలు చేశాడు. చివరకు ఈ అద్భుతాన్ని కెమెరాలో విజయవంతంగా బంధించగలిగాడు. ‘పోలార్ సన్’ నేషనల్ జాగ్రఫిక్ నౌక ‘పోలార్ సన్’ గ్రీన్లాండ్ తీరానికి ఆవల సముద్రం మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు తారసపడిన దృశ్యం ఇది. రెండు మంచుఖండాల మధ్యనున్న చోటు నుంచి ప్రయాణిస్తున్న చిన్న పడవ కనిపించడంతో, ఓడలోనున్న ఫొటోగ్రాఫర్ రెనాన్ ఓజ్టర్క్ తన ద్రోన్ కెమెరాను సంధించి, ఈ అద్భుత చిత్రాన్ని బంధించాడు. పశ్చిమాఫ్రికాలోని పోర్చుగీస్ ఆర్చిపెలాగో పర్వతప్రాంతంలోని ‘మడీరా లారెల్’ అరణ్యం. పురాతన వృక్షాలతో అలరారే ఈ అరణ్యాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఈ అరణ్యంలోని చెట్లు ఒక్కొక్కటి వెయ్యి అడుగుల నుంచి ఐదువేల అడుగుల ఎత్తున ఉంటాయి. అమెరికన్ ఫొటోగ్రాఫర్ ఓర్సోల్యా హార్స్బెర్గ్ ఈ ఫొటో తీసింది. వెనిజులా రాజధాని కరకస్లో కనిపించిన దృశ్యం ఇది. వేకువ జామునే పిట్టగోడపై వాలి మేత కోసం ఎదురుచూస్తున్న బ్లూ అండ్ యెల్లో మకావ్ పక్షులు. రామచిలుకల జాతికి చెందిన ఈ పక్షులకు స్థానికులు రోజూ పొద్దున్నే మేత పెడుతుంటారు. ఈ దృశ్యాన్ని వెనిజులాకు చెందిన ఫొటోగ్రాఫర్ అలెజాండ్రా సెగారా తన కెమెరాలో బంధించాడు. చదవండి: సముద్రంలో వెయ్యి మీటర్ల లోతు.. ఆహా అనిపించేలా నగరం! -
Afghan Girl: అప్పుడూ ఇప్పుడూ.. ఆమే! పాపం మరోసారి..
Nat Geo Green-Eyed Girl, "Most Famous Afghanistan Refugee": పాలనా సంక్షోభం ఏర్పడితే దేశ పౌరుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుంది. ఇటువంటి నిస్సహాయ పరిస్థితులను 30 ఏళ్ల క్రితం ఎదుర్కొని శరణార్థిగా మారింది అఫ్గానిస్తాన్‌కు చెందిన షర్బత్ గుల్. గత నలభై ఏళ్లలో తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొన్న అఫ్గానిస్తాన్ మరోసారి తాలిబన్ల కబంధ హస్తాల్లోకి వెళ్లడంతో..49 ఏళ్ల వయసులో షర్బత్ మరోసారి శరణార్థిగా మారింది. అది అఫ్గానిస్తాన్‌ను జాహీర్ షా అనే రాజు పరిపాలించే రోజులు. నలభై ఏళ్లపాటు ఒకే రాజు పరిపాలించడంతో.. విసిగిపోయిన ప్రజలు, అధికారులు.. జాహీర్ షా కుటుంబానికి చెందిన మొహమ్మద్ దావుద్ ఖాన్‌కు పట్టంగట్టారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సరికొత్త సంస్కరణలు దావూద్ అమలు చేసేవాడు. అవి నచ్చని ప్రతిపక్షం రకరకాల కుట్రలతో ప్రభుత్వాన్ని పడగొట్టి, అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ పార్టీ పాలనలో కొన్ని నిర్ణయాలు సొంత సభ్యులకే నచ్చకపోవడంతో.. పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయి అధికారం కోసం కుమ్ములాటలు, కుతంత్రాలతో పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. ఈ నేపథ్యంలో తలెత్తిన రాజకీయ అనిశ్చతిలో ఎంతో మంది అఫ్గాన్లు, సోవియట్ సైనికులు మరణించగా, లక్షలాదిమంది దేశం విడిచి వేరే దేశాలకు వలస వెళ్లిపోయారు. అలా వెళ్లినవారిలో షర్బత్ కూడా ఒకరు. 80వ దశకంలో పాపులర్ ఫోటో.. దేశంలో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకు షర్బత్ కుటుంబం పాకిస్థాన్‌కు వలస వెళ్లింది. అప్పుడు షర్బత్ వయసు పన్నెండేళ్లు. అఫ్గాన్––పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న ఓ శరణార్థి శిబిరంలో షర్బత్‌ను స్టీవ్ మెకెర్రీ అనే అమెరికన్ ఫోటోగ్రాఫర్ 1984లో చూశాడు. ఆకుపచ్చని రంగులో మెరుస్తున్న ఆమె కళ్లు మెకెర్రీని ఆకర్షించడంతో వెంటనే ఆమె ఫోటో తీశాడు. అప్పటి భీకర యుద్ధవాతావరణ పరిస్థితులన్నీ షర్బత్ పచ్చని కళ్లలో ప్రతిబింబించాయి. దీంతో ఆ ఫోటోను నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజీన్ కవర్ పేజీపైన 1985లో ప్రచురించారు. ‘‘అఫ్ఘన్ గర్ల్’’గా షర్బత్ ప్రపంచమంతా పాపులర్ అయ్యింది. 1980 – 1990 దశకంలో బాగా పాపులర్ అయిన ఫోటోలలో అఫ్గాన్ గర్ల్ ఒకటిగా నిలిచింది. తనకు పాపులారిటి వచ్చిందని షర్బత్‌కు ఏమాత్రం తెలీదు.పెళ్లి తరువాతే తను ఎంత పాపులర్ అయ్యిందో తెలుసుకుని ఆ ఫోటోను తీసుకుంది. 2002 వరకు షర్బత్ ఎక్కడ ఉందన్న విషయం ఎవరికీ తెలీదు. మెకెర్రీ మళ్లీ షర్బత్ ఆచూకీ తెలుసుకుని..ఎఫ్‌బీఐ అనలిస్టు, ఫోరెన్సిక్ విభాగానికి ఇవ్వడంతో.. వారు షర్బత్‌గా నిర్ధారించారు. పాకిస్థాన్‌లో తలదాచుకుంటోన్న సమయంలోనే 16 ఏళ్ల వయసులో రహ్మత్ గుల్‌ను పెళ్లిచేసుకుంది. షర్బత్ దంపతులకు నలుగురు పిల్లలు. పాకిస్థాన్‌లో కుటుంబంతో జీవనం సాగిస్తోన్న షర్బత్‌కు ముఫ్పై ఏళ్ల తరువాత అక్కడ కూడా ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. అది 2016 షర్బత్‌కు నలభై ఏళ్లు. “తమ దేశంలో నకిలీ గుర్తింపు పత్రాలతో అక్రమంగా నివసిస్తోందన్న ఆరోపణతో షర్బత్‌కు పాక్ ప్రభుత్వం.. పదిహేను రోజుల జైలుశిక్ష, లక్షాపదివేల రూపాయల రుసుమును కట్టించి స్వదేశానికి పంపించేసింది. ఆ సమయంలో అఫ్ఘన్ అధ్యక్షుడిగా ఉన్న అష్రఫ్ ఘనీ... షర్బత్ పరిస్థితి తెలుసుకుని, కాబూల్‌లో ఓ అపార్ట్మెంట్లో ఉండేందుకు వసతి కల్పించారు. అప్పటి నుంచి అక్కడే కుటుంబంతో నివసిస్తోంది షర్బత్. హెపటైటీస్ సీతో 2012లో షర్బత్ భర్త మరణించడం, ఆగస్టులో తాలిబన్లు అఫ్గాన్ అధికారం చేపట్టడంతో ఆమె కథ మళ్లీ మొదటికి వచ్చింది. తాలిబన్ల పాలనలో జీవించలేక, ముందుముందు జీవితం మరింత దారుణంగా మారుతుందని భావించి ఆశ్రయం ఇవ్వాలని ఇటలీ ప్రభుతాన్ని కోరింది. షర్బత్ పరిస్థితి అర్థం చేసుకున్న ఇటలీ ప్రధాన మంత్రి మారియో డ్రాఘి షర్బత్‌కు ఆశ్రయం కల్పించారు. అప్పుడూ ఇప్పుడూ ఆఫ్ఘన్ అమ్మాయిలకు భద్రత లేదని, తాజాగా షర్బత్ ఎదుర్కొంటున్న పరిస్థితులు కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. చదవండి: Mother Shipton Cave Facts: భేతాళ కథల్లో మాదిరి.. ఈ నీటిలో పడితే వెంటనే రాయిలా అయిపోతారు..! -
ప్రత్యక్ష ప్రసారంలో బ్రెయిన్ సర్జరీ!
రోజులు ఎంతగానో మారిపోయాయి. ఒకప్పుడు లైవ్ ప్రొగ్రామ్లంటే ఏ సంగీత కచేరిలో, ఆడియో ఫంక్షన్లో, వేడుకలు, ఉత్సవాలో చూపించేవారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారాలు కూడా ఒక స్టంట్ గా మారిపోయాయి. ఒక వ్యక్తి తనను అనకొండ సర్పం మింగుతుండగా ప్రత్యక్ష ప్రసారం చేస్తానని ప్రకటించాడు. దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. అయితే, తాజాగా ఓ టీవీ చానెల్ వినూత్న లైవ్ కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. వైద్యులు ఒక వ్యక్తి మెదడుకు శస్త్రచికిత్స నిర్వహిస్తుండగా లైవ్ లో ప్రసారం చేసింది. దీనిపై కొందరు ఆశ్చర్యం, కొందరు విస్మయం వ్యక్తం చేశారు. 'బెయిన్ సర్జరీ లైవ్' పేరిట గత ఆదివారం నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్ లో ఓ కార్యక్రమాన్ని ప్రసారం చేశారు. క్లీవ్‌ల్యాండ్ లోని కేస్ మెడికల్ సెంటర్ యూనివర్సిటీ ఆస్పత్రిలో 49 ఏళ్ల గ్రెగ్ గ్రిండ్లే అనే వ్యక్తి మెదడుకు వైద్యుల బృందం శస్త్రచికిత్స నిర్వహించింది. ఈ కార్యక్రమంతా ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ ప్రత్యక్ష ప్రసారం వైద్యులు మాట్లాడుతూ ఈ శస్త్రచికిత్సకు సంబంధించిన వివిధ ప్రొసీజర్స్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తాము ఇందుకు సిద్ధపడ్డామని తెలిపారు. కార్యక్రమం ప్రసారానికి ముందు వ్యాఖ్యాత బ్రియంట్ గంబెల్ మాట్లాడుతూ తాము లైవ్ లో చూపిస్తున్నది సంగీత కచేరి కాదని, ఈ కార్యక్రమం గురించి వీక్షకుల అంచనాలు తమకు తెలుసని పేర్కొన్నారు. పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న గ్రిండ్లేకు శస్త్రచికిత్స విజయం లేదా వైఫల్యం వల్ల జీవన్మరణ ప్రభావం ఉండకపోయినా.. ఇది విజయవంతమైతే చాలా ఏళ్లపాటు అతని జీవితంపై ప్రభావం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ ప్రత్యక్ష ప్రసారం మెదడు గురించి పండుగ జరుపుకోవడం లాంటిదని పేర్కొన్నారు. -
టార్జాన్
1985లో రిలీజైన ‘టార్జాన్’ ఫ్లాపా యావరేజా హిట్టా సూపర్హిట్టా ఎవ్వరూ చెప్పలేరు. కాని చాలామంది ఈ సినిమాను రకరకాల కారణాల వల్ల చూశారు. టార్జాన్ కథ అప్పటికే బాలసాహిత్యం ద్వారా పాప్యులర్ కావడం ఒక కారణమైతే నేషనల్ జియోగ్రఫిక్ వంటి చానెల్స్ అందుబాటులో లేని రోజుల్లో అడవులు చూపించే ఏ సినిమా అయినా చూడాలనే కుతూహలం ప్రేక్షకులకు ఉండేది. దానికి తోడు దర్శకుడు బి.సుభాష్ తెలివిగా కిమి కాట్కర్ అందాలను ఆరబోయడంతో ఈ సినిమా మాస్ ప్రేక్షకులందరినీ ఊపేసింది. ఆ రోజులో అలా తెర మీద ఒక హీరోయిన్ని దాదాపు నగ్నంగా చూపడం పెద్ద విశేషం. టార్జాన్‌గా నటించిన హేమంత్ బిర్జే కన్నడిగుడు. ఎత్తుగా కండలతో ఉండటం తప్ప యాక్టింగ్‌లో పస లేకపోవడం వల్ల రాణించలేదు. కిమి మాత్రం మరికాస్త ముందుకెళ్లి అమితాబ్‌తో ‘హమ్’ వంటి సినిమాల వరకూ నటించింది. ప్రస్తుతం ఆమె ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ శంతనును పెళ్లి చేసుకుని ఆస్ట్రేలియాలో లేదంటే పుణె శివార్లలో ఇండస్ట్రీకి దూరంగా జీవిస్తోంది. టార్జాన్కు బప్పి లాహిరి చేసిన పాటలు పెద్ద హిట్. జిలేలే జిలేలా ఆయొ ఆయొ జిలేలా..... మేరే సాత్ గావోనా జూబీ జుబి జుబి జూబీ... టార్జాన్ మై టార్జాన్... ఆ రోజుల్లో మోగిపోయాయి. ఆ సినిమా వచ్చాకే చిరంజీవి ‘అడవి దొంగ’ రావడం యాదృచ్చికం కాదు. -
పులి పోరు.. అవార్డుల జోరు..
ఈరోజు నువ్వో నేనో తేలిపోవాల్సిందే అంటూ హోరాహోరీగా పోరాడుతున్న ఈ పులుల చిత్రం బాగుంది కదూ.. దీన్ని తీసింది మన దేశానికి చెందిన ఫొటోగ్రాఫర్ అర్చనా సింగ్. ఆమె ఈ చిత్రాన్ని ఈ ఏడాది మే 5న మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌గఢ్ జాతీయ పార్కులో తీశారు. ప్రతిష్టాత్మక నేషనల్ జియోగ్రాఫిక్ రీడర్స్ ఫొటో ఆఫ్ ద ఇయర్-2014 పోటీలో ‘నేచర్’ విభాగంలో ఈ ఫొటోకు ప్రత్యేక ప్రశంస లభించింది. -
భాగ్యనగరం.. బెస్ట్..
ఈ మాట మేమంటున్నది కాదు.. స్వయంగా నేషనల్ జియోగ్రఫిక్ ట్రావెలర్ మేగజైనే పేర్కొంది. 2015లో ప్రపంచ పర్యాటకులు తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశాల జాబితాలో మన హైదరాబాద్‌కూ చోటు కల్పించింది. ‘బెస్ట్ ఆఫ్ ద వరల్డ్’ పేరిట నేషనల్ జియోగ్రఫిక్ ఎంపిక చేసిన 20 ప్రదేశాల జాబితాలో మన భాగ్యనగరమూ ఉంది. భారత్ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక నగరం మనదే కావడం విశేషం. ముత్యాల నగరంగా పేరొందిన హైదరాబాద్ అత్యద్భుతమైన ఆధ్యాత్మిక, చారిత్రక కట్టడాలకు, రాజభవనాలకు నెలవు అని పేర్కొంది. అదే సమయంలో ఈ మొత్తం 20 ప్రదేశాల్లో తన ఫేవరెట్లుగా పేర్కొంటూ బ్రిటన్‌కు చెందిన డెయిలీ మెయిల్ పత్రిక టాప్-7 పేరిట ఓ జాబితాను ప్రచురించింది. అందులోనూ మన నగరానికి(7వ స్థానం) చోటు దక్కింది. -
ధర్మవరం పట్టుచీరలకు అరుదైన గౌరవం