సాల్మన్ దీవుల్లో భూకంపం
సిడ్నీ : పసిఫిక్ మహాసముద్రంలోని సాల్మన్ దీవుల్లో గురువారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.9గా నమోదైంది. భూకంపం భూమి లోపల 19 కిలోమీటర్ల లోతులో ఏర్పడింది. ఈమేరకు అమెరికా జియాలజికల్ సర్వే సంస్థ వెల్లడించింది. సునామీ ప్రమాదం లేదని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ప్రపంచంలో భూకంపం వచ్చే ప్రాంతాల్లో ఇది ఒక్కటని పేర్కొంది. గత మూడేళ్ల కాలవ్యవధిలో దాదాపు 30 స్వల్ప భూకంపాలు సంభవించాయని యూఎస్ జియోలాజికల్ సర్వే చెప్పింది.